హైదరాబాద్ : హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్ మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ (Deputy Commissioner) లంచం (Bribe) తీసుకుంటూ రెడ్ హ్యండెడ్‌గా పట్టుబడ్డారు. మున్సిపల్ పరిధిలోని ఒక హోటల్లో ఇటీవల మున్సిపల్ అధికారులు దాడులు నిర్వహించారు. కిచెన్‌లో అపరిశుభ్రంతో పాటు నాణ్యత లేని ఆహారాన్ని అందిస్తున్నరన్న ఆరోపణలపై దాడులు చేసి కేసులు నమోదు చేశారు.
అయితే హోటల్‌ను సీజ్ చేయవద్దని రాజేంద్రనగర్ సర్కిల్ 11, డిప్యూటీ కమిషనర్ కె రవికుమార్‌ను( Ravikumar) కోరగా రూ. 5లక్షలు డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించగా వ్యూహం ప్రకారం శుక్రవారం రూ.2 లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. అతడిపై కేసు నమోదు చేసి జ్యూడిషియల్ కస్టడీకి పంపించామని ఏసీబీ అధికారులు వెల్లడించారు.