Joe Root | టీమిండియాపై ‘రూట్’ ఆధిపత్యం.. ఆస్ట్రేలియా లెజెండ్‌ను వెనక్కి నెట్టేశాడుగా
Joe Root : ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్న తొలి టెస్టులో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ జో రూట్(Joe Root) అరుదైన ఫీట్ సాధించాడు. టెస్టు ఫార్మాట్లో భారత జట్టు(Team India)పై అత్యధిక రన్స్ కొట్టిన బ్యాటర్‌గా రికార్డు నెలకొల్పాడు. తద్వారా ఆస్ట్రేలియా దిగ్గజం...
Joe Root : ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్న తొలి టెస్టులో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ జో రూట్(Joe Root) అరుదైన ఫీట్ సాధించాడు. టెస్టు ఫార్మాట్లో భారత జట్టు(Team India)పై అత్యధిక రన్స్ కొట్టిన బ్యాటర్‌గా రికార్డు నెలకొల్పాడు. తద్వారా ఆస్ట్రేలియా దిగ్గజం రికీ పాంటింగ్(Ricky Ponting) రికార్డును రూట్ బ్రేక్ చేశాడు.
ఫాబ్ 4 ఒకడైన ఈ ఇంగ్లండ్ స్టార్ రెండో ఇన్నింగ్స్‌లో 2 పరుగులు చేశాడు. దాంతో, భారత్‌పై 2,557 పరుగులు సాధించాడు. అతడు 47 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ మైలురాయికి చేరుకోవడం విశేషం. టీమిండియాపై మెరుగైన రికార్డు ఉన్న పాంటింగ్ 51 ఇన్నింగ్స్‌ల్లో 54.36 సగటుతో 2,555 రన్స్ కొట్టాడు. ఈ జాబితాలో ఇంగ్లండ్ మాజీ సారథి అలెస్టర్ కుక్() మూడో స్థానంలో కొనసాగుతున్నాడు.
Joe Root is now the leading run-scorer against India in Tests 🔝 #INDvENG pic.twitter.com/wBQwI6noDF
— ESPNcricinfo (@ESPNcricinfo) January 27, 2024
కుక్ 54 ఇన్నింగ్స్‌ల్లో47.66 సగటుతో 2,431 రన్స్ బాదాడు. ప్రపంచంలోని అత్యుత్తమ టెస్టు బ్యాటర్లలో ఒకడైన రూట్ ఇప్పటివరకూ 136 మ్యాచ్‌లు ఆడాడు. 249 ఇన్నింగ్స్‌ల్లో అతడు 49.99 సగటుతో 20,179 రన్స్ కొట్టాడు. అతడి ఖాతాలో 30 సెంచరీలు, 5 డబుల్ సెంచరీలు, 60 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
సచిన్ టెండూల్కర్, రూట్

భారత్, ఇంగ్లండ్ టెస్టు సిరీస్‌లో అత్యధిక పరుగుల వీరుడిగా రూట్ మరో రికార్డు తన పేరిట లిఖించకున్నాడు. ఉప్పల్ టెస్టుకు ముందు సచిన్ టెండూల్కర్(Sachin Tendulkar) 2,535 రన్స్‌తో అగ్రస్థానంలో ఉన్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో అక్షర్ పటేల్ బౌలింగ్‌లో బౌండరీ కొట్టిన రూట్.. మాస్లర్ బ్లాస్టర్‌ను దాటేశాడు. ప్రస్తుతం అతడు 2,557 పరుగులతో టాప్‌లో కొనసాగుతున్నాడు.
తొలి ఇన్నింగ్స్‌లో 29 పరుగులకే ఔటైన రూట్.. రెండో ఇన్నింగ్స్‌లోనూ నిరాశపరిచాడు. బెన్ డకెట్( 47) ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన ఈ స్టార్ బ్యాటరల్ కుదురుకున్నట్టే కనిపించాడు. అయితే.. 6 బంతులకు 2 పరుగులు చేసిన రూట్‌ను బుమ్రా ఎల్బీగా వెనక్కి పంపాడు. దాంతో, ఇంగ్లండ్ 117 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయింది.
ఇవి కూడా చదవండి
- Indi A vs England Lions | నిప్పులు చెరిగిన సౌరభ్ కుమార్.. ఇన్నింగ్స్ తేడాతో ఇంగ్లండ్ లయన్స్ చిత్తు
- Mamata Banerjee | పెండింగ్ నిధులు వారంలోగా చెల్లించాలి.. మోదీ సర్కార్‌కు మమతా బెనర్జీ అల్టిమేటం
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: పార్టీ సమావేశంలో కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్షణ.. పూలగుత్తులు, బూట్లు విసురుకున్న వైనం
IND vs WI | భారత్‌తో మూడో టీ20.. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న వెస్టిండీస్
Pakistan | పాకిస్తాన్, ఖైబర్ పఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.. పీటీఐ ప్రభుత్వం రద్దు.. సీఎం అరెస్ట్
Agriculture Admissions | వ్యవసాయ కోర్సుల్లో మిగిలిన సీట్లకు కౌన్సెలింగ్.. ఈ నెల 14 నుంచి ప్రారంభం
Kadapa DSP | కడప డీఎస్పీగా భవానీ భాధ్యతల స్వీకరణ
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

