Bommadevara Dhiraj : ఒలిపింక్స్‌లో కోట్లాదిమంది భారతీయుల ఆశల్ని మోస్తున్న అథ్లెట్ల బృందం పతకాల వేటకు సిద్ధమైంది. టోక్యోలో 7 పతకాలతో తిరిగొచ్చిన భారత అథ్లెట్లు, క్రీడాకారులు ఈసారి రెండంకెలపై గురి పెట్టారు. ఈసారి పారిస్ వెళ్లిన స్క్వాడ్‌లోని యువకెరటాల్లో కొందరు మెడల్‌పై ఆశలు రేపుతున్నారు. వీళ్లలో తెలుగు కుర్రాడు బొమ్మదేవర ధీరజ్(Bommadevara Dhiraj) ఒకడు. ఎన్నో కష్టాలను దాటి తన కలల కెరీర్ అయిన ఆర్చరీలో రాణిస్తున్న ధీరజ్ ఇప్పుడు విశ్వ క్రీడల్లో తన సత్తా చాటేందుకు ఉవ్విళ్లూరుతున్నాడు.
గురి తప్పని విలుకాడిగా పేరొందిన ధీరజ్ ఒలింపిక్ జర్నీ వెనుక కన్నీళ్లు తెప్పించే కష్టాలు, మొక్కవోని సంకల్పం దాగున్నాయి. చాలా కొద్దిమందికే తెలిసిన అతడి నేపథ్యాన్ని ధీరజ్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించాడు. ‘ఆర్చర్‌గా నేను రాణించడంలో అమ్మాన్నా పాత్ర ఎంతో ఉంది. నాకు కొత్త విల్లు, బాణాలు కొనిచ్చేందుకు అమ్మ రేవతి తన తాళిబొట్టును తాకట్టు పెట్టింది. ఇక మా నాన్న శ్రావణ్ కుమార్ వ్యాపారంలో చాలా నష్టపోయారు. దాంతో, ఒకదేశలో మేము సర్వం కోల్పోయాం. అంతటి కష్టంలోనూ ఆయన నన్ను ప్రోత్సహించారు. అందుకని ఒలింపిక్స్‌లో నా అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి తల్లిదండ్రులు గర్వపడేలా చేయాలనుకుంటున్నా’ అని ధీరజ్ తెలిపాడు.
ధీరజ్ సొంతూరు అంధ్రప్రదేశ్‌లోని విజయవాడ. బొమ్మదేవర శ్రావణ్ కుమార్, బొమ్మదేవర రేవతి దంపతులకు 2001లో ధీరజ్ జన్మించాడు. తండ్రి ఆర్చరీ ఆసోసియేషన్ ఆఫ్ ఇండియాలో టెక్నికల్ ఆఫీసర్. అమ్మ ఓ స్కూల్లో టీచర్. చిన్నవయసులోనే రామాయణ, మహాభారతం వంటి పురాణ కథలు విని ఆర్చరీ మీద మక్కువ పెంచుకున్నాడు.
అమ్మానాన్నతో ధీరజ్..

2006 నుంచి 2008 మధ్య చెరుకూరి వోల్గా ఆర్చరీ అకాడమీలో శిక్షణ తీసుకున్నాడు. అక్కడ అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ఒలింపిక్ గోల్డ్ క్వెస్ట్ కార్యక్రమానికి ఎంపికయ్యాడు. ఈ కమ్రంలో ఆర్ధిక కష్టాలు అడ్డుపడినా సరే చెక్కుచెదరని ఆత్మవిశ్వాసంతో, అంకుఠిత దీక్షతో ధీరజ్ ముందుకు సాగాడు.
Perfect landing 🎯❌#ArcheryAsia #archery pic.twitter.com/VhkPo8UwjA
— World Archery (@worldarchery) November 14, 2023
ఇక 2021లో పోలాండ్లోని వ్రాక్లోలో జరిగిన వరల్డ్ యూత్ చాంపియన్‌షిప్స్‌లో ధీరజ్ గోల్డ్ మెడల్‌తో చరిత్ర సృష్టించాడు. అక్కడితో మొదలైన అతడి జైతయాత్ర ఆసియా గేమ్స్‌లోనూ కొనసాగింది. 2022 ఆసియా క్రీడల్లో వెండి పతకం గెలిచిన భారత ఆర్చరీ జట్టులో ధీరజ్ సభ్యుడు. ఇప్పుడు ఒలింపిక్స్ వ్యక్తిగత ర్యాంకింగ్స్ రౌండ్లో తెలుగు కుర్రాడు నాలుగో స్థానంలో నిలిచాడు. దాంతో, భారత్ క్వార్టర్స్ చేరడంలో కీలక పాత్ర పోషించాడు.