GST – CBIC | మూడు రేట్ల శ్లాబ్లలోకి జీఎస్టీ స్ట్రక్చర్.. తేల్చి చెప్పిన సీబీఐసీ చైర్మన్
GST - CBIC | ప్రస్తుతం అమల్లో ఉన్న జీఎస్టీ శ్లాబ్‌ల వ్యవస్థను మూడు శ్లాబ్‌ల్లోకి క్రమబద్ధీకరించాల్సిన అవసరం ఉందని కేంద్ర పరోక్ష పన్నుల మండలి (సీబీఐసీ) చైర్మన్ సంజయ్ కుమార్ అగర్వాల్ తేల్చేశారు.
GST – CBIC | ప్రస్తుతం దేశీయంగా అమల్లో ఉన్న జీఎస్టీ శ్లాబ్‌ల విధానంపై సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ టాక్సెస్ అండ్ కస్టమ్స్ (సీబీఐసీ) చైర్మన్ సంజయ్ కుమార్ అగర్వాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పరోక్ష పన్నుల శ్లాబ్ వ్యవస్థను కనీస టాక్స్ శ్లాబ్లుగా క్రమబద్దీకరించాల్సి ఉందన్నారు. ప్రస్తుతం జీఎస్టీ అండ్ కస్టమ్స్ విధానంలో అమల్లో ఉన్న క్లాసిఫికేషన్లను కేంద్ర ప్రభుత్వం పూర్తిగా పునర్వ్యవస్థీకరించనున్నదన్నారు. జీఎస్టీలో మూడు శ్లాబ్‌ల వ్యవస్థ అమల్లోకి తీసుకొచ్చే అవకాశం ఉందని సంజయ్ కుమార్ అగర్వాల్ తెలిపారు.
ప్రస్తుతం జీఎస్టీలో నాలుగు పన్ను శ్లాబ్‌లు – 5శాతం, 12శాతం,18 శాతం,28 శాతం పన్ను విధానాలు అమల్లో ఉన్నాయి. సామాన్య పౌరుడు వినియోగించే వస్తువులపై గరిష్ట, కనిష్ట పన్ను శ్లాబ్, సంపన్న వర్గాలు వినియోగించే వస్తువులపై హయ్యర్ శ్లాబ్ వర్తింప చేయాలని సంజయ్ కుమార్ అగర్వాల్ తెలిపారు. దీనిపై జీఎస్టీ కౌన్సిల్ తుది నిర్ణయం తీసుకుంటుంది. ప్రస్తుతం పెండింగ్ లో ఉన్న జీఎస్టీ రీఫార్మ్స్ మీద జీఎస్టీ కౌన్సిల్ తుది నిర్ణయం తీసుకోనున్నది. ఇందుకోసం నియమించిన జీఎస్టీ కమిటీకి బీహార్ డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరి సారధ్యం వహిస్తున్నారు. జీఎస్టీ పన్నుల వ్యవస్థల హేతుబద్ధీకరణపై కొత్తగా ఏర్పాటైన సామ్రాట్ చౌదరి కమిటీ తుది నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

