Panchayat Elections | ఆగస్టులోనే పంచాయతీ ఎన్నికలు..! రిజర్వేషన్ల విషయంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం..!!
Panchayat Elections | తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు మరి కొద్దిరోజుల్లోనే నగారా మోగనుంది. త్వరలోనే ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసి, ఆగస్టు నెల చివరి వరకు పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది.
Panchayat Elections | హైదరాబాద్ : తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు మరి కొద్దిరోజుల్లోనే నగారా మోగనుంది. త్వరలోనే ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసి, ఆగస్టు నెల చివరి వరకు పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. అయితే ఐదేండ్ల క్రితం ఎన్నికల్లో కేటాయించిన రిజర్వేషన్ల ప్రకారమే ఎన్నికలు నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లు సమాచారం.
ఈ రోజు జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇప్పటికే సర్పంచుల పదవీకాలం ముగిసి ఆరు నెలలు కావస్తున్నందున రిజర్వేషన్లలో ఎలాంటి మార్పు లేకుండా గత రిజర్వేషన్లలే కొనసాగించాలని, ఆగష్టు నెలలో ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సమావేశంలో మంత్రి సీతక్కతో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల పెంపుపై కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని అధికారులను సీఎం రేవంత్‌రెడ్డి వారం రోజుల క్రితం ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ల అమలు, రాబోయే ఎన్నికల్లో వాటి పెంపునకు సంబంధించిన అంశాలను వెల్లడించాలని అధికారులకు సీఎం సూచించారు. గత పంచాయతీ ఎన్నికల్లో అనుసరించిన విధానం, రానున్న పంచాయతీ ఎన్నికలకు సన్నద్ధమవుతున్న తీరును రేవంత్‌కు అధికారులు వివరించారు.
ఇప్పటికే కులగణనకు ఆమోదం తెలిపినందున, దాని ఆధారంగా పంచాయతీ ఎన్నికలకు వెళితే ఎలా ఉంటుందని, అందుకు ఎంత సమయం తీసుకుంటారని అధికారులను సీఎం ప్రశ్నించారు. కర్ణాటకలో 2015లో, బీహార్‌లో 2023లో కుల గణన చేశారని, ఆంధ్రప్రదేశ్‌లో కులగణన చేసినా వివరాలు ఇంకా బయట పెట్టలేదని అధికారులు వివరించారు.
2011లో కేంద్ర ప్రభుత్వం అనుసరించిన కులగణన ఫార్మాట్ 53 కాలమ్స్‌తో ఉన్నదని, దానికి మరో మూడు కాలమ్స్ జోడించి కులగణన చేపడితే కనీసం అయిదున్నర నెలల సమయం పడుతుందని తెలిపారు. బీసీ రిజర్వేషన్ల పెంపుతో పాటు స్థానిక సంస్థలకు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు ఆగిపోకుండా త్వరగా ఎన్నికలు నిర్వహించేందుకు అవసరమైన ప్రణాళిక సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు. ఈ సమావేశంలో రిజర్వేషన్ల పెంపు అంశంపై సుదీర్ఘ చర్చ సాగింది. మొత్తానికి ఈ పరిణామాల నేపథ్యంలో గత ఎన్నికల్లో కేటాయించిన రిజర్వేషన్ల ప్రకారమే పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం.
ఇవి కూడా చదవండి..
iPhone | కస్టమ్స్ డ్యూటీ తగ్గింపు.. ఐ-ఫోన్లపై బంపరాఫర్.. భారీగా ధరలు తగ్గించిన ఆపిల్..!
Prabhas | సైనికుడిగా ప్రభాస్.. కొత్త సినిమాకు ముహూర్తం ఖరారు..!
Hyderabad | వారం రోజుల పాటు హైదరాబాద్‌లో దంచికొట్టిన వాన.. ఇవాళ భానుడు ప్రత్యక్షం..
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas | వచ్చే ఏడాది దీపావళికి ‘స్పిరిట్’
Dasara Property Sales | దసరా సందడి నిల్.. అమ్మకాలు, లాంచింగ్ లేక వ్యాపారం దివాళా
Crazy Kalyanam | రివార్డులతోపాటు అవార్డులూ సాధించే సినిమా
Tiger Shroff | టైగర్ష్రాఫ్పై కాల్పులు.. తీవ్రంగా గాయపడిన డ్రైవర్
France Protests | ఫ్రాన్స్ అగ్నిగుండం.. భవనాలకు నిప్పు, దుకాణాలు లూటీ.. హింసాత్మకంగా మారిన నిరసనలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

