Indi A vs England Lions | నిప్పులు చెరిగిన సౌరభ్ కుమార్.. ఇన్నింగ్స్ తేడాతో ఇంగ్లండ్ లయన్స్ చిత్తు
Indi A vs England Lions : సొంతగడ్డపై ఇంగ్లండ్ లయన్స్( England Lions)తో జరిగిన అనధికారిక రెండో టెస్టులో భారత ఏ జట్టు(Indi A) అద్భుత విజయం సాధించింది. ఇన్నింగ్స్ 16 పరుగుల తేడాతో గెలుపొందింది. మూడో రోజు ఐదు వికెట్లతో లయన్స్ నడ్డి విరిచిన పేసర్ సౌరభ్ కుమార్(Sourabh Kumar) భారత్‌ను...
Indi A vs England Lions : సొంతగడ్డపై ఇంగ్లండ్ లయన్స్( England Lions)తో జరిగిన అనధికారిక రెండో టెస్టులో భారత ఏ జట్టు(Indi A) అద్భుత విజయం సాధించింది. ఇన్నింగ్స్ 16 పరుగుల తేడాతో గెలుపొందింది. మూడో రోజు ఐదు వికెట్లతో లయన్స్ నడ్డి విరిచిన పేసర్ సౌరభ్ కుమార్(Sourabh Kumar) భారత్‌ను గెలుపు వాకిట నిలిపాడు.
నాలుగో రోజు 33 పరుగుల లోటుతో ఇన్నింగ్స్ ఆరంభించిన ఇంగ్లండ్ లయన్స్ జట్టును అర్ష్‌దీప్ సింగ్, యశ్ దయాల్ దెబ్బ కొట్టారు. వీళ్లిద్దరూ చెరో రెండు వికెట్లు పడగొట్టడంతో ఇంగ్లండ్ లయన్స్ పరిమితమైంది. ఈ విజయంతో భారత ఏ జట్టు 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. సెంచరీ వీరుడు సర్ఫరాజ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.
సర్ఫరాజ్ ఖాన్ (161)

భారత బౌలర్ల ధాటికి తొలి ఇన్నింగ్స్‌లో 152 పరుగులకే కుప్పకూలిన ఇంగ్లండ్ లయన్స్.. రెండో ఇన్నింగ్స్‌లోనూ కనీస పోరాటం కనబరచలేదు. ఓలీ రాబిన్సన్ 84 నాటౌట్), జోష్ బొహన్నన్(48)లు మాత్రమే ఫర్వాలేదనిపించారు. తొలి ఇన్నింగ్స్‌లో భారత ఏ జట్టు 489 రన్స్ కొట్టింది. రంజీ పరుగుల వీరుడు సర్ఫరాజ్ ఖాన్ (161), దేవ్‌దత్ పడిక్కల్(105) సెంచరీలతో జట్టుకు భారీ స్కోర్ అందించారు.
సౌరభ్ కుమార్

చివర్లో వచ్చిన సౌరభ్ కుమార్(77) అర్ధ శతకం బాదడంతో భారత ఏ జట్టు ఇంగ్లండ్ లయన్స్ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. అనంతరం సౌరభ్ బంతితోనూ చెలరేగడంతో ఇంగ్లండ్ లయన్స్ జట్టు ఏ దశలోనూ గెలిచేలా కనిపించలేదు. ఇరుజట్ల మధ్య చివరి మ్యాచ్ అహ్మదాబాద్‌లో ఫిబ్రవరి 1న జరుగనుంది.
ఇవి కూడా చదవండి
- Adilabad | పురుగుల మందు తాగి భార్య ఆత్మహత్య.. అపవాదు తనపై వస్తుందని భర్త బలవన్మరణం
- Nitish Kumar | ముఖ్యమంత్రి పదవికి నేడు రాజీనామా చేయనున్న నితీశ్ కుమార్..?
- Australia Open | జపాన్ టీనేజర్‌కు సింగిల్స్ ట్రోఫీ.. స్లొవేకియా స్టార్‌కు తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nana Patekar | గుండెపోటుతోనే నానాపటేకర్ మరణం.. పోస్టుమార్టం నివేదికలో వెల్లడి
Athletics | అథ్లెటిక్స్‌లో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ
New Delhi | న్యూఢిల్లీలో ఉద్రిక్తత.. ఆందోళనకారులతోపాటు జర్నలిస్టుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు
Delhi Police | దీప్కేకు అతడి నానమ్మ మరణవార్తను వెంటనే తెలియజేశాం : ఢిల్లీ పోలీసులు
BRS Councilors | మున్సిపల్ కమిషనర్ తీరుపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తాం : బీఆర్ఎస్ కౌన్సిలర్స్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

