Adilabad | ఆదిలాబాద్‌లో విషాదం.. ఒకేరోజు భార్యాభర్తలు బలవన్మరణం
ఆదిలాబాద్ (Adilabad) జిల్లా గుడిహత్నూర్ మండలం కొల్హారిలో విషాదం చోటుచేసుకున్నది. భార్య ఆత్మహత్య చేసుకున్న రోజే భర్త బలవన్మరణానికి పాల్పడ్డాడు.
ఆదిలాబాద్: ఆదిలాబాద్ (Adilabad) జిల్లా గుడిహత్నూర్ మండలం కొల్హారిలో విషాదం చోటుచేసుకున్నది. భార్య ఆత్మహత్య చేసుకున్న రోజే భర్త బలవన్మరణానికి పాల్పడ్డాడు. మహారాష్ట్రకు చెందిన పల్లవితో కొల్హారి గ్రామనికి చెందిన విజయ్‌కి గతేడాది మే నెలలో వివాహం జరిగింది. సంక్రాంతి పండగకు పుట్టింటికి వెళ్లిన పల్లవి.. శుక్రవారం మధ్యాహ్నం అత్తగారి ఇంటికి వచ్చింది. కుటుంబసభ్యులు వ్యవసాయ పనులు ముగించుకుని సాయంత్రం ఇంటికి వచ్చేసరికి పల్లవి పురుగు మందు తాగి అపస్మారక స్థితిలోకిపోయింది. దీంతో వెంటనే ఆమెను రిమ్స్‌కు తరలించారు. అయితే అప్పటికే పల్లవి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
కాగా, తనపై అపవాదు వస్తుందన్న భయంతో విజయ్ పురుగు మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. భార్యభర్తలు ఒకేసారి చనిపోవడంతో గ్రామంలో విషాద చాయలు అలముకున్నాయి. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పల్లవి మృతికి గల కారణాలు తెలియాల్సి ఉన్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
Nana Patekar | గుండెపోటుతోనే నానాపటేకర్ మరణం.. పోస్టుమార్టం నివేదికలో వెల్లడి
Athletics | అథ్లెటిక్స్‌లో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

