TVS | ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ ‘టీవీఎస్ మోటారు సైకిల్ ఇండియా’ 2.64 లక్షల యూనిట్ల పాపులర్ సుజుకి యాక్సెస్ 125 (Suzuki Access 125) స్కూటర్లు రీకాల్ చేస్తున్నట్లు ప్రకటించింది. స్కూటర్లో ‘హై టెన్షన్ కోర్డ్’ సంబంధించిన సాంకేతిక లోపం తలెత్తడం వల్లే 2.64 లక్షల సుజుకి యాక్సెస్ (Suzuki Access 125) స్కూటర్లను రీకాల్ చేస్తున్నట్లు తెలిపింది. 2022 ఏప్రిల్ నుంచి 2022 డిసెంబర్ మూడో తేదీ వరకు తయారైన సుజుకి యాక్సెస్ 125 (Suzuki Access 125) 2,63,788 యూనిట్లు రీకాల్ చేస్తున్నట్లు పేర్కొంది.ప్రస్తుతం దేశీయంగా అత్యధికంగా అమ్ముడవుతున్న స్కూటర్లలో సుజుకి యాక్సెస్ 125 (Suzuki Access 125) ఒకటి. హోండా యాక్టివా 125, టీవీఎస్ జూపిటర్ 125, హీరో డెస్టినీ 125 స్కూటర్లకు సుజుకి యాక్సెస్ 125 పోటీ ఇస్తోంది.
‘ఇగ్నిషియన్ కాయిల్తో ఇన్స్టల్ చేసిన హై టెన్షన్ కారోడ్ లో క్రాక్స్, బ్రేకేజీ వల్ల ప్రయాణిస్తున్నప్పుడు ఇంజిన్ ఊగుతూ నిలిచిపోతున్నది. తదుపరి స్టార్టింగ్ ఫెయిల్యూర్ సమస్య వస్తోంది’ అని సియామ్ డేటా పేర్కొంది. హైటెన్స్ కార్డ్ వాటర్ కు ఎక్స్ పోజ్ అయినప్పుడు ఇగ్నిషియన్ కాయిల్ లీకేతే వెహికల్ స్పీడ్ సెన్సర్, థ్రోటిల్ పొజిషన్ సెన్సర్ దెబ్బ తినడంతో స్పీడ్ డిస్ ప్లే ఫెయిల్యూర్ గానీ, స్టార్టింగ్ ఫెయిల్యూర్ గానీ జరుగుతుంది.
సుజుకి యాక్సెస్ 125 స్కూటర్లకు తోడు సుజుకి అవెనిస్ స్కూటర్లు 52,578 యూనిట్లు, సుజుకి బర్గ్ మాన్ 72045 యూనిట్లు ఇదే అంశంపై రీకాల్ చేస్తున్నట్లు సుజుకి మోటార్ సైకిల్స్ ఇండియా తెలిపింది. మొత్తం 3,88,411 యూనిట్ల సుజుకి యాక్సెస్ 125, సుజుకి అవెనిస్, సుజుకి బర్గ్ మాన్ స్కూటర్లు రీకాల్ చేస్తున్నట్లు తెలిపింది.