Joe Root : ప్రపంచంలోనే అత్యుత్తమ టెస్టు బ్యాటర్లలో ఒకడైన జో రూట్ (Joe Root) రికార్డుల పర్వాన్ని లిఖిస్తున్నాడు. ఇంగ్లండ్ తరఫున అత్యధిక శతకాల వీరుడిగా చరిత్ర సృష్టించిన ఈ స్టార్ ప్లేయర్ మరో మైలురాయిని అధిగమించాడు. స్వదేశంలో భారత్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో పరుగుల వరద పారిస్తున్న రూట్.. జాక్వెస్ కలిస్ (Jacques Kallis)ను దాటేశాడు. మాంచెస్టర్ టెస్టులో మూడో రోజు 32 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద అతడీ ఘనత సాధించాడు. దక్షిణాఫ్రికా వెటరన్ 13,289 రన్స్‌తో మూడో స్థానంలో ఉండగా.. రూట్ అతడిని అధిగమించాడు.
ప్రస్తుతం ఇంగ్లండ్ మాజీ సారథి టాప్ -3లో కొనసాగుతున్నాడు. అతడి కంటే ముందు సచిన్ టెండూల్కర్(15,921), రికీ పాంటింగ్(13,378)లు ఉన్నారంతే. రూట్ ఇదే తీరుగా చెలరేగితే పాంటింగ్‌ను దాటేసి టాప్ 2గా నిలవడం ఖాయం. తొలిసారి నిర్వహిస్తున్న అండర్సన్ టెండూల్కర్ ట్రోఫీలో రూట్ శతకాలతో రెచ్చిపోయాడు. లార్డ్స్ మైదానంలో భారత్‌పై సూపర్ సెంచరీతో జట్టును ఆదుకున్న రూట్ కెరియర్లో 37వ సారి మూడంకెల స్కోర్ అందుకున్నాడు. తనకు అచ్చొచ్చిన వేదికపై మరెవరికీ సాధ్యం కాని రికార్డును పట్టేశాడు రూట్. ఇక టీమిండియాపై అత్యధిక పర్యాయాలు వంద కొట్టిన రెండో ఆటగాడిగా చరిత్ర సృష్టించాడీ ఇంగ్లండ్ మాజీ సారథి.
Joe Root moves past Rahul Dravid and Jacques Kallis to become the third-highest run-scorer in Test history 🥉 pic.twitter.com/YNMm4Galdd
— ESPNcricinfo (@ESPNcricinfo) July 25, 2025
లార్డ్స్‌లో కీలక ఇన్నింగ్స్‌తో శతకం బాది జట్టును పటిష్ట స్థితిలో నిలిపిన రూట్ ఒకే మైదానంలో అత్యధిక సెంచరీల వీరుల క్లబ్లో చేరాడు. అతడికి ఈ మైదానంలో ఇది ఎనిమిదో సెంచరీ కాగా.. శ్రీలంక వెటరన్ మహేల జయవర్దనే కొలంబో మైదానంలో ఏకంగా 11 సెంచరీలతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.
ఈ జాబితాలో లెజెండ్ డాన్ బ్రాడ్‌మన్ మెల్బోర్న్ గ్రౌండ్లో 9 సార్లు శతకం బాదాడు. దక్షిణాఫ్రికా మాజీ ఆల్‌రౌండర్ జాక్వెస్ కలిస్ కేప్ టౌన్లో రికార్డు స్థాయిలో 9 పర్యాయాలు మూడంకెల స్కోర్ అందుకున్నాడు. కుమార సంగక్కర (శ్రీలంక) తమ దేశంలోని కొలంబో స్టేడియంలో 8 సెంచరీలతో రికార్డు నెలకొల్పాడు. ఇండియా అంటే చాలు పూనకం వచ్చినట్టు ఆడే రూట్ 11 సెంచరీలతో ఆస్ట్రేలియా వెటరన్ బ్యాటర్ స్టీవ్ స్మిత్(Steve Smith) సరసన చేరాడు. వెస్టిండీస్ దిగ్గజం వివ్ రిచర్డ్స్, గ్యార్‌ఫీల్డ్ సోబర్స్ తలా 8 శతకాలు బాదారు.
Most Test centuries against India:
𝗝𝗼𝗲 𝗥𝗼𝗼𝘁 – 𝟭𝟭
Steve Smith – 11
Ricky Ponting – 8
Viv Richards – 8
Garfield Sobers – 8 pic.twitter.com/GW5Xh5q1uk
— ESPNcricinfo (@ESPNcricinfo) July 11, 2025