Ration card | రేషన్ కార్డు అనేది పేదల ఆత్మ గౌరవం.. రేషన్ కార్డుల పంపిణీలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
రాష్ట్ర వ్యాప్తంగా జూలై 25 నుండి ఆగస్టు 10 వరకు నూతనంగా మంజూరైన రేషన్ కార్డుల పంపిణీ మండల కేంద్రాల్లో కొనసాగుతుందని, రేషన్ కార్డు అనేది పేదల ఆత్మ గౌరవమని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.
Ration card | జగిత్యాల, జూలై 25: రాష్ట్ర వ్యాప్తంగా జూలై 25 నుండి ఆగస్టు 10 వరకు నూతనంగా మంజూరైన రేషన్ కార్డుల పంపిణీ మండల కేంద్రాల్లో కొనసాగుతుందని, రేషన్ కార్డు అనేది పేదల ఆత్మ గౌరవమని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. స్థానిక బీఎల్ఎన్ గార్డెన్లో జగిత్యాల అర్బన్, రూరల్ మండలాలకు చెందిన 10 వేల 17 కొత్త తెలుపు రంగు రేషన్ కార్డులను శుక్రవారం లబ్ధిదారులకు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, కలెక్టర్ బీ సత్య ప్రసాద్ తో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మనిషికి 6 కిలోల చొప్పున సన్నబియ్యం పంపిణీ చేస్తున్నట్లు వివరించారు.
కొత్తగా రేషన్ కార్డు పొందిన వారికి రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి, గృహజ్యోతి పథకాలకు దరఖాస్తు చేసుకునేందుకు తాజాగా అవకాశం కల్పించిందని తెలిపారు. రేషన్ కార్డుల స్థితిని పౌరసరఫరాల శాఖ వెబ్సైట్లో తెలుసుకోవచ్చని, రేషన్ కార్డుల పంపిణీ నిరంతర ప్రక్రియ అని, కార్డు రాని వారు మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. తెలంగాణ ప్రత్యేకంగా రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత రేషన్ కార్డుల పంపిణీ ఆశించిన మేర జరగలేదని ఎక్కువ సంఖ్యలో రేషన్ కార్డు దరఖాస్తులు వచ్చాయని, వీటన్నింటిని పరిశీలించిన తర్వాత అర్హులైన లబ్ధిదారులను గుర్తించి వారికి రేషన్ కార్డులు పంపిణీని ప్రభుత్వం మొదలు పెట్టిందని అన్నారు.
15 రోజుల పాటు రేషన్ కార్డులు పంపిణీ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారని, అన్ని మండల కేంద్రాల్లో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించాలని అధికారులకు సూచించారు. రేషన్ కార్డులు లేక పథకాలకు దూరంగా ఉన్న వారికి ఇప్పుడు ప్రభుత్వ నిర్ణయంతో ప్రయోజనాలు దక్కనున్నాయని, ఈ నెల 25 నుంచి వచ్చే నెల 10 వరకు అన్ని మండల కేంద్రాల్లో అధికారికంగా కొత్త రేషన్ కార్డుల పంపిణీ చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బీఎస్ లత, ఆర్డీవో మధు సుధన్, సివిల్ సప్లై అధికారి జితేందర్ రెడ్డి, ఎస్సీ వెల్ఫేర్ ఆఫీసర్ రాజ్ కుమార్, సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | కరువు తెచ్చి.. వరి వద్దంటరా?.. కాంగ్రెస్ సర్కార్‌పై కేటీఆర్ ఫైర్
Anirudh Reddy | 40 కోట్ల బిల్లులిస్తరా.. చావమంటరా?.. జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి అల్టిమేటం
Power Cuts | వాటర్ ఫిల్లింగ్ స్టేషన్లకు విద్యుత్ షాక్.. కరెంటు కోతలతో ఒక్కో ట్యాంకర్ డెలివరీకి 3, 4 రోజుల సమయం
Farmers Self Declaration | రైతులకే డిక్లరేషన్ ఎందుకు.. ప్రజావాణిలో నిలదీసిన అన్నదాత
Balmoor Venkat | పొలం దారి ఆక్రమించిన బల్మూరి.. చంపేస్తమని బెదిరింపులు.. కలెక్టర్, ఎస్పీకి ఫిర్యాదు చేసిన వృద్ధుడు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

