Edgbaston Test : ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో భారత జట్టు ఆరొందల స్కోర్‌కు చేరువైంది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్(265 నాటౌట్) రెండో సెషన్లోనూ జోరు చూపించి 250 మార్క్ అందుకోగా.. అతడితో కలిసి కీలక భాగస్వామ్యం నెలకొల్పిన వాషింగ్టన్ సుందర్ (42) వెనుదిరిగాడు. బషీర్, టంగ్ బౌలింగ్‌లో కళాత్మక షాట్లతో అలరించిన వాషీ అర్ధ శతకానికి ముందు జోరూట్ ఓవర్లో బౌల్డయ్యాడు. దాంతో, 558 పరుగుల వద్ద టీమిండియా ఏడో వికెట్ పడింది.
అయినా క్రీజులో సారథి గిల్ ఉండడంతో భారత్ ధీమాగానే ఉంది. టెయిలెండర్ల సహకారంతో కెప్టెన్ ట్రిపుల్ సెంచరీ కొట్టాక ఇన్నింగ్స్ డిక్లేర్ చేసే అవకాశముంది. ఆకాశ్ దీప్ క్రీజులోకి వచ్చిన కాసేపటికే టీ బ్రేక్ ప్రకటించారు. అప్పటికీ భారత్ స్కోర్.. 564/7
రెండో రోజు కూడా భారత బ్యాటర్ల జోరుతో డీలాపడిన ఇంగ్లండ్‌కు జో రూట్ బ్రేకిచ్చాడు. అర్ధ శతకానికి చేరువైన వాషింగ్టన్ సుందర్(42)ను బౌల్డ్ చేసి ఆతిథ్య జట్టుకు ఊరటనిచ్చాడు. కాసేపట్లో లంచ్ అనగా రవీంద్ర జడేజా(89) ఔటయ్యాక.. క్రీజులోకి వచ్చిన సుందర్ సాధికారిక ఇన్నింగ్స్ ఆడాడు. ఇంగ్లండ్ పేసర్లను సమర్దంగా ఎదుర్కొన్న అతడు.. క్రీజులో పాతుకుపోయాక బౌండరీలతో చెలరేగాడు.
ROOOOOOOT!
Washington Sundar is bowled by Joe Root for 4️⃣2️⃣ just before tea.
🇮🇳 5️⃣5️⃣8️⃣-7️⃣ pic.twitter.com/KbjME0TDxz
— England Cricket (@englandcricket) July 3, 2025
మరో ఎండ్‌లో శుభ్‌మన్ గిల్ రికార్డుల పర్వాన్ని కొనసాగిస్తున్నాడు. ఏడో వికెట్‌కు అతడు సుందర్‌తో కలిసి విలువైన144 పరుగులు జోడించాడు. అయితే.. జో రూట్ ఓవర్లో సుందర్ బౌల్డ్ కావడంతో 558 వద్ద టీమిండియ వద్ద ఏడో వికెట్ కోల్పోయింది.