World Boxing Cup : వరల్డ్ బాక్సింగ్ కప్‌లో భారత బృందం అదరగొడుతోంది. ఇప్పటికే మూడు పతకాలు ఖారారు కాగా గురువారం నాడు మరో ఇద్దరు బాక్సర్లు దేశం గర్వపడేలా చేశారు. పురుషుల 70 కిలోల విభాగంలో హితేశ్ గులియా(Hitesh Gulia), మహిళల 54 కిలోల కేటగిరీలో సాక్షి(Sakshi) సెమీఫైనల్‌కు దూసుకెళ్లి పతకం ఖాయం చేశారు. కజకిస్థాన్‌లోని అస్తానా వేదికగా జరుగుతున్న ఈ మెగా టోర్నీలో.. ఈ ఏడాది ఆరంభంలో బ్రెజిల్ గడ్డపై స్వర్ణం సాధించిన హితేశ్ ధాటికి స్థానిక బాక్సర్ అల్మాజ్ ఒరొజ్బెకొవ్ చిత్తయ్యాడు.
గురువారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో భారత బాక్సర్ 5-0తో అల్మాజ్ను మట్టికరిపించి పసిడి పోరుకు మరింత చేరువయ్యాడు. ఇక సాక్షి తన పంచ్ పవర్ చూపిస్తూ బ్రెజిల్ బాక్సర్ తతియనా రెజీనా జీసస్ చగాస్ను ఓడించింది. ప్రత్యర్థి నుంచి కనీస ప్రతిఘటన లేకపోవడంతో ఏకపక్ష పోరులో సాక్షి విజయదుందుబి మోగించింది.
3 into the semis. 2 into the quarters on Day 3! 🇮🇳🥊(2/2)
Minakshi, Pooja Rani, and Sanju confirmed medals with strong wins, while Anamika & Abhinash joined the charge in the quarters.
India’s momentum continues at the #WorldBoxingCup, Astana, KZ 2025.#PunchMeinHaiDum #BFI pic.twitter.com/DFwI5fdwZd
— Boxing Federation (@BFI_official) July 3, 2025
వేదిక ఏదైనా తమకు తిరుగులేదని చాటుతున్నారు భారత బాక్సర్లు. హితేశ్, సాక్షిలు ప్రత్యర్థులను చిత్తు చేసి ఫైనల్‌కు అడుగు దూరంలో నిలిచారు. బుధవారం జరిగిన బౌట్స్‌లో మీనాక్షి(48 కిలోలు), పూజా రాణి(80 కిలోలు), సంజూ(60 కిలోలు)లు సెమీఫైనల్‌కు దూసుకెళ్లారు. మిగతా వాళ్లలో అనామిక (51 కిలోలు) క్వార్టర్ ఫైనల్ ఫైట్కోసం కాచుకొని ఉంది. దాంతో, ఈసారి మరిన్ని పతకాలు భారత్ ఖాతాలో చేరడం ఖాయం. అదే జరిగితే.. టోర్నీకి ఇండియా బృందం ఘనంగా వీడ్కోలు పలకనుంది.