Urea provided to farmers | ఆర్మూర్ టౌన్ : ఆర్మూరు మండలం లోని ఈస పెళ్లి గ్రామంలో ఏర్పడిన యూరియా కొరతపై ‘నమస్తేతెలంగాణ’లో యూరియా ఏదయా..! అనే కథనాన్ని గురువారం ప్రచురించింది.
కాగా స్పందించిన వ్యవసాయ శాఖ అధికారులు గురువారం యూరియా లారీని ఈస పెళ్లి గ్రామానికి తరలించి యూరియాను రైతులకు పంపిణీ చేశారు. యూరియాను రైతులకు అందజేయడంతో రైతులు ఆనందంతో యూరియా బస్తాలను వారి వారి పంట పొలాల్లో తీసుకెళ్లారు.