Renovation committee | సారంగాపూర్, జులై 3 : మండలంలోని ప్రముఖ పుణ్య క్షేత్రం పెంబట్ల శ్రీ దుబ్బ రాజేశ్వర స్వామి ఆలయ రెనోవేషన్ కమిటీని ఏర్పాటు చేస్తూ ఎండోమెంట్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. పెంబట్ల శ్రీ దుబ్బరాజేశ్వర స్వామి ఆలయానికి 11 మంది సభ్యులతో రెనోవేషన్ కమిటీని ఏర్పాటు చేశారు.
ఇందులో రెనోవేషన్ కమిటీ సభ్యులుగా కొండ్ర రాంచందర్ రెడ్డి, వాసం శ్రీనివాస్, కోలపాల రవి, పంగ కిష్టయ్య, పిన్నం సత్యనారాయణ, మానుక గంగమ్మ, రంగు శంకర్, మతులపూరం శంకర్, చెట్ట శేఖర్, సూర సత్యనారాయణ రెడ్డి, ఉరుమల్ల పోశాలుతో రెనోవేషన్ కమిటిని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వుల్లో పేర్కోన్నారు. వీరు ఒక సంవత్సరం రెనోవేషన్ కమిటీ సభ్యులుగా కొనసాగనున్నారు.
ఈ సందర్భంగా తమ నియమకానికి సహకరించిన దేవాదాయ, ఎస్సీ సంక్షేమ శాఖల మంత్రులు కొండ సురేఖ, అడ్లూరి లక్ష్మన్ కుమార్, మాజీ మంత్రి జీవన్ రెడ్డికి ఈ సందర్భంగా కమిటీ సభ్యులు కొండ్ర రాంచంధర్ రెడ్డి, కమిటీ సభ్యులు కృతజ్ణతలు తెలిపారు.