IND vs NZ 3rd Test : ముంబైలోని వాంఖడే మైదానంలో జరుగుతున్న మూడో టెస్టులో భారత స్పిన్నర్లు చెలరేగుతున్నారు. తొలుత వాషింగ్టన్ సుందుర్ న్యూజిలాండ్‌ను కష్టాల్లోకి నెట్టగా.. రవీంద్ర జడేజా(2/41) ‘నేనేమీ తక్కువా’ అంటూ విజృంభించాడు. ఒకే ఓవర్లో రెండు కీలక వికెట్లు తీసి జట్టుకు బ్రేకిచ్చాడు. క్రీజులో పాతుకుపోయిన విల్ యంగ్(71)ను, టామ్ బ్లండెల్(0)ను ఔట్ చేసి న్యూజిలాండ్‌ను గట్టి దెబ్బ కొట్టాడు.
తొలి రెండు టెస్టుల్లో గెలుపొంది సిరీస్ సాధించిన న్యూజిలాండ్‌కు శుభారంభం దక్కలేదు. తొలి వికెట్‌కు కెప్టెన్ టామ్ లాథమ్(28), డెవాన్ కాన్వే(4)లు కేవలం 15 రన్స్ జోడించారంతే. కాన్వేను ఎల్బీగా ఔట్ చేసిన ఆకాశ్ దీప్ భారత్‌కు బ్రేకిచ్చాడు. అనంతరం సుందర్ తన మ్యాజిక్ చూపిస్తూ లాథమ్, రచిన్ రవీంద్ర(5)లను వెనక్కి పంపాడు. అంతే.. మూడు వికెట్లు పడ్డాయి. కానీ, విల్ యంగ్(71), డారిల్ మిచెల్(41 నాటౌట్)లు ఆచితూచి ఆడారు. దాంతో, 92-3తో న్యూజిలాండ్ లంచ్‌కు వెళ్లింది.
Talk about striking in a quick succession! ⚡️ ⚡️
A double-wicket over for #TeamIndia, courtesy Ravindra Jadeja! 👌 👌
Live ▶️ https://t.co/KNIvTEy04z#INDvNZ | @imjadeja | @IDFCFIRSTBank pic.twitter.com/D6WrpGPmx3
— BCCI (@BCCI) November 1, 2024
భోజన విరామం తర్వాత కూడా యంగ్, మిచెల్‌లు భారత బౌలర్లను విసిగించారు. నాలుగో వికెట్‌కు 70కి పైగా రన్స్ జోడించి న్యూజిలాండ్‌ను ఆదుకున్నారు. ప్రమాదకరంగా మారిన ఈ జోడీని జడేజా విడదీశాడు. ఒకే ఒకే ఓవర్లో విల్ యంగ్(71)ను, టామ్ బ్లండెల్(0)ను ఔట్ చేసి పర్యాటక జట్టును ఒత్తిడిలో పడేశాడు. జడేజా జోరుతో న్యూజిలాండ్ సగం వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం డారిల్ మిచెల్(41), గ్లెన్ ఫిలిఫ్స్(3)లు క్రీజులో ఉన్నారు. 46 ఓవర్లకు న్యూజిలాండ్ స్కోర్.. 160-5.