Ravindra Jadeja : భారత సీనియర్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా (Ravindra Jadeja) వరుసపెట్టి రికార్డులు సృష్టిస్తున్నాడు. వాంఖడేలో న్యూజిలాండ్ బ్యాటర్లను వణికించిన జడేజా 24 గంటల్లోనే సుదీర్ఘ ఫార్మాట్లో మరో రికార్డు సాధించాడు. వాంఖడే టెస్టులో న్యూజిలాండ్‌పై రెండో ఇన్నింగ్స్‌లోనూ ఐదు వికెట్లు తీసిన జడేజా టెస్టుల్లో 15వ సారి ఈ ప్రదర్శన చేశాడు.
తద్వారా టీమిండియా తరఫున టెస్టుల్లో నాలుగోసారి 10 వికెట్లు తీసిన బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు. తద్వారా భారత దిగ్గజం కపిల్ దేవ్ (Kapil Dev) రికార్డను జడ్డూ బద్ధలు కొట్టాడు. టెస్టుల్లో విశేషంగా రాణిస్తున్న జడేజా కీలకమైన టెస్టులో సత్తా చాటుతూ కివీస్ నడ్డి విరిచాడు. తొలి ఇన్నింగ్స్‌లో 6 వికెట్లు, రెండో ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు పడగొట్టి నాలుగోసారి 10 వికెట్ల ఫీట్ నమోదు చేశాడు.
Ravindra Jadeja surpassed Ishant Sharma and Zaheer Khan to enter the top five of India’s highest wicket-takers in Test cricket after his five-for in the #INDvNZ Mumbai Test 👏#WTC25 pic.twitter.com/ANZIIQjN3u
— ICC (@ICC) November 1, 2024
ప్రస్తుతం అనిల్ కుంబ్లే ఏడు పర్యాయాలు 10 వికెట్లు తీసి అగ్రస్థానంలో ఉన్నాడు. రవిచంద్రరన్ అశ్విన్ ఆరు సార్లు 10 వికెట్లతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. మూడో స్థానంలో హర్భజన్ సింగ్ ఉన్నాడు. కుంబ్లే 63 మ్యాచుల్లో, అశ్విన్ 65 మ్యాచుల్లో ఈ ఘనత సాధించగా.. జడేజా 49 మ్యాచుల్లో 4వసారి 10 వికెట్లు తీశాడు. ఇక కపిల్ దేవ్ 65 మ్యాచుల్లో రెండు పర్యాయాలు పది వికెట్లతో గర్జించాడు.
సిరీస్‌లో చివరిదైన మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో గ్లెన్ ఫిలిఫ్స్‌ను ఔట్ చేసిన జడేజా 14 సారి ఐదు వికెట్లతో మెరిశాడు. దాంతో, టెస్టుల్లో ఐదో బౌలర్‌గా జడ్డూ రికార్డు సృష్టించాడు. టీమిండియా వెటరన్ పేసర్లు జహీర్ ఖాన్ (Zaheer Khan), ఇషాంత్ శర్మ (Ishant Sharma)ల రికార్డులు గల్లంతయ్యాయి.