Kiran Abbavaram | చిన్న సినిమాగా వచ్చి బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అందుకుంది క చిత్రం. టాలీవుడ్ యువ నటుడు కిరణ్ అబ్బవరం ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాకు సుజీత్, సందీప్ ఇద్దరు దర్శకులు సంయుక్తంగా దర్శకత్వం వహించగా.. కిరణ్ అబ్బవరం సోంత బ్యానర్‌పై వస్తున్న ఈ సినిమాను చింతా గోపాలకృష్ణ రెడ్డి భారీ బడ్జెట్‌తో నిర్మించారు. నయన్ సారిక కథానాయికగా నటించింది. దీపావళి కానుకగా అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుంది. తొలిరోజే రూ.6 కోట్ల వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం మూడు రోజుల్లో రూ.19 కోట్ల వసూళ్లను రాబట్టినట్లు చిత్రబృందం తెలిపింది. కిరణ్ అబ్బవరంకు కూడా చాలా రోజుల తర్వాత హిట్ పడడంతో మూవీని చూడడానికి ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కడుతున్నారు.
ఈ సినిమా కథ విషయానికి వస్తే.. అభినయ వాసుదేవ్ (కిరణ్ అబ్బవరం) అనాథ. ఎప్పటికైనా తన తల్లిదండ్రులు తిరిగొస్తారన్న ఆశతో జీవిస్తుంటాడు. ఇతరుల ఉత్తరాలు చదువుతూ.. వాటిని తన సొంత వాళ్లే రాసినట్లు ఊహించుకుంటూ.. ఆ రాతల్లో తాను పోగొట్టుకున్న బంధాల్ని చూసుకుంటాడు. ఈ ఆనందం రోజూ ఉండాలని, తనో పోస్ట్‌మ్యాన్ కావాలని నిశ్చయించుకుంటాడు. ఆ అలవాటులో భాగంగా శరణాలయం వార్డెన్ ఉత్తరం చదువుతూ వార్డెన్‌కి దొరికిపోతాడు. అతను వాసుదేవ్‌ని కొట్టి, మందలించి వదిలిపెట్టేస్తాడు. ఓ రోజు వార్డెన్ దగ్గరున్న డబ్బును దొంగిలించి, శరణాలయం నుంచి పారిపోతాడు వాసుదేవ్. తన కూతురు ఆపరేషన్‌కోసం వార్డెన్ దాచుకున్న డబ్బు అది. ఆ డబ్బు పోవడంతో వార్డెన్ షాక్‌కి గురవుతాడు. ఆపరేషన్ జరగకపోవడంతో అతని కూతురు చనిపోతుంది. ఇవేమీ పారిపోయిన వాసుదేవ్‌కి తెలీదు. తాను ఆ డబ్బుతో వేరే ఊరు చేరుకొని తన ఆశయసాధన కోసం టెన్త్ వరకూ చదువుపూర్తి చేస్తాడు. కృష్ణగిరి అనే ఊళ్లో అసిస్టెంట్ పోస్ట్‌మ్యాన్ ఉద్యోగం ఖాళీగా ఉందని తెలిసి, ఆ ఊరు చేరుకుంటాడు. ఇక అక్కడ ఎదురైన పరిణామాలేంటి? అసలు వాసుదేవ్ ఆ జైల్లో ఎందుకు పడ్డాడు? అతడ్ని ఇంటరాగేట్ చేస్తున్న వాళ్లు ఎవరు? ఈ ప్రశ్నలకు సమాధానమే అసలు కథ.
The Love, Response, and Collections Keep Growing for Diwali Winner #KA 🤩#DiwaliKAblockbuster Earns staggering 19.41 Crores in 3 Days❤️🔥
Day 3 > Day 2 > Day 1 – A Fantastic Day 4 Loading🥳@Kiran_Abbavaram MASS ❤️🔥 pic.twitter.com/9mKMGPGvDr
— BA Raju’s Team (@baraju_SuperHit) November 3, 2024