IND vs ENG : లార్డ్స్ టెస్టులో భారత బ్యాటర్లు సమిష్టిగా రాణిస్తున్నారు. మూడో రోజు రెండో సెషన్లో కేఎల్ రాహుల్ (100) సెంచరీ తర్వాత ఔటైనా మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు. రాహుల్ వికెట్‌తో ఇండియాపై ఒత్తిడి పెంచాలనుకున్న బెన్ స్టోక్స్ సేన వ్యూహాల్ని రవీంద్ర జడేజా (40 నాటౌట్), నితీశ్ కుమార్ రెడ్డి(25 నాటౌట్)లు చిత్తు చేశారు. కొత్త బంతితో హడలెత్తించినా సరే సమయోచితంగా ఆడుతూ.. స్కోర్ 300 దాటించారు. వీళ్లిద్దరూ ఆరో వికెట్‌కు అజేయంగా 62 రన్స్ జోడించగా టీ బ్రేక్ సమయానికి ఇండియా 5 వికెట్ల నష్టానికి 316 పరుగులు చేసింది. ఇంకా తొలి ఇన్నింగ్స్‌లో 71 రన్స్ వెనకబడి ఉంది. మూడో సెషన్లో ఈ ఇద్దరు మరింత జాగ్రత్తగా ఆడితే భారత్ పటిష్ట స్థితిలో నిలిచినట్టే.
లార్డ్స్‌లో జరుగుతున్న మూడో టెస్టులో భారత జట్టు ప్రత్యర్థి స్కోర్‌కు సమీపించింది. ఓపెనర్ కేఎల్ రాహుల్(100) శతకంతో మెరవగా.. రిషభ్ పంత్ (74) సూపర్ హాఫ్ సెంచరీతో జట్టును ఆదుకున్నాడు. తొలిసెషన్లో డ్రింక్స్ బ్రేక్ వరకూ ఓపికగా ఆడిన పంత్, రాహుల్ ఆ తర్వాత బౌండరీలతో విధ్వంసం సృష్టించారు. తన మార్క్ షాట్లతో ఇంగ్లండ్ బౌలర్లను ఉతికేసిన వైస్ కెప్టెన్ పంత్ స్టోక్స్ ఓవర్లో సిక్సర్‌తో అర్ధ శతకం బాదాడు.
It’s Tea on Day 3 of the Lord’s Test! #TeamIndia move to 316/5.
Ravindra Jadeja (40*) & Nitish Kumar Reddy (25*) will resume the proceedings in the final session 🔜.
Updates ▶️ https://t.co/X4xIDiSmBg#ENGvIND | @imjadeja | @NKReddy07 pic.twitter.com/MUAqwpMEms
— BCCI (@BCCI) July 12, 2025
అయితే.. లంచ్‌కు ముందు ఓవర్లో రాహుల్ సెంచరీ కోసం సింగిల్ తీయబోయిన పంత్‌ను స్టోక్స్ మెరుపు వేగంతో రనౌట్ చేశాడు. అంతే.. నాలుగో వికెట్‌కు 141 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. స్కోర్ 248/4తో లంచ్‌కు వెళ్లిన భారత్.. రెండో సెషన్ మొదలైన కాసేపట్లోనే రాహుల్ వికెట్ కోల్పోయింది. అనంతరం జడేజా(40 నాటౌట్), నితీశ్ రెడ్డి(25 నాటౌట్)లు క్రీజులో నిలబడినా.. సమన్వయం కొరవడి మూడుసార్లు రనౌట్ ప్రమాదం తప్పించుకున్నారు.