నల్లగొండ, జూలై 12 : ఉమ్మడి నల్లగొండ జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ చైర్మన్ కుంభం శ్రీనివాస్‌రెడ్డి నాఫ్స్కాబ్ (నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ స్టేట్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్) డైరెక్టర్‌గా నియమితులయ్యారు. ఈ మేరకు నాఫ్స్కాబ్ మేనేజింగ్ డైరెక్టర్ బీమా సుబ్రహ్మణ్యం శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. నల్లగొండ డీసీసీబీలో డైరెక్టర్లతో పాటు ఉద్యోగులను సమన్వయం చేయడంతో పాటు డీసీసీబీని రూ.3 వేల కోట్ల టర్నోవర్‌తో అభివృద్ధిపథంలో నడుతున్న నేపథ్యంలో ఆయనను డైరెక్టర్‌గా నియమించినట్లు సుబ్రహ్మణ్యం తెలిపారు.