IPL 2025 : ఉప్పల్ స్టేడియంలో పరుగుల వరద పారింది. ఫ్లాట్ పిచ్ మీద పంజాబ్ కింగ్స్(Punjab Kings) టాపార్డర్ బ్యాటర్లు వీరవిహారం చేశారు. ఓపెనర్లు ప్రభ్ సిమ్రన్ సింగ్(42), ప్రియాన్ష్ ఆర్య(36)లు శుభారంభం ఇవ్వగా.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్(82) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఫోర్లు, సిక్సర్లతో హోరెత్తించిన అయ్యర్ అర్ధ శతకంతో చెలరేగాడు. జట్టు స్కోర్ 200 దాటించి ఆరెంజ్ ఆర్మీని భయపెట్టాడు. అయితే.. హర్షల్ పటేల్(4-42) సంచనల బౌలింగ్‌తో కీలక వికెట్లు తీసి బ్రేకిచ్చాడు. అయితే. మార్కస్ స్టోయినిస్(34 నాటౌట్) 20వ ఓవర్లో ఏకంగా నాలుగు సిక్సర్లు బాదడంతో పంజాబ్ నిర్ణీత ఓవర్లో 6 వికెట్ల నష్టానికి 245 రన్స్ కొట్టింది. సొంత మైదానంలో వరుసగా రెండు మ్యాచుల్లో ఓడిన ఆరెంజ్ ఆర్మీకి ఈసారి ఛేజింగ్ అతి పెద్ద సవాల్ కానుంది.
చావోరేవో మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్రత్యర్థికి భారీ స్కోర్ సమర్పించుకుంది. టాస్ ఓడిన ఆరెంజ్ ఆర్మీ బౌలర్లను పంజాబ్ కింగ్స్ ఓపెనర్లు ఉతికారేశారు. చెన్నైపై శతకంతో గర్జించిన ప్రియాన్ష్ ఆర్య(36) సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. మరోవైపు ప్రభ్‌సిమ్రన్ సింగ్(42) హ్యాట్రిక్ బౌండరీలతో విజృంభించాడు. అయితే.. హర్షల్ పటేల్ బౌలింగ్ పెద్దషాట్ ఆడిన ప్రియాన్ష్.. నితీశ్ కుమార్ రెడ్డి చేతికి చిక్కాడీ చిచ్చరపిడుగు. దాంతో, 66 వద్ద పంజాబ్ తొలి వికెట్ పడింది. ఆ తర్వాత వచ్చిన కెప్టెన్ శ్రేయస్ అయ్యార్(9) సైతం ఓపెనర్ ప్రభ్‌సిమ్రన్‌తో కలిసి దూకుడు ఆడాడు. దాంతో పవర్ ప్లేలో వికెట్ నష్టానికి పంజాబ్ 89 రన్స్ కొట్టింది.
Innings Break!
A dominant effort with the bat powers #PBKS to their highest #TATAIPL total against #SRH 🔥
Will the hosts chase this down?
Updates ▶ https://t.co/RTe7RlXDRq #TATAIPL | #SRHvPBKS pic.twitter.com/yHUWtWNRgz
— IndianPremierLeague (@IPL) April 12, 2025
హాఫ్ సెంచరీకి చేరువైన ప్రభ్‌సిమ్రన్‌ను ఈషన్ మలింగ పెవిలియన్ పంపాడు. 91 వద్ద రెండో వికెట్ పడినా అయ్యర్ మాత్ం జోరు తగ్గించలేదు. నేహల్ వధేర(27) అండగా మరింత చెలరేగిపోయాడు. వీళ్లిద్దరి మెరుపులతో 13 ఓవర్లకే 160 కొట్టింది. అయితే.. డేంజరస్ శశాంక్ సింగ్(2) వికెట్‌ను రివ్యూ తీసుకొని సాధించింది హైదరాబాద్. ఈషన్ మలింగ వేసిన 18వ ఓవర్లో అయ్యర్ 4 ఫోర్లు సంధించి పంజాబ్ స్కోర్ 200 దాటించాడు.
6, 6, 6, 6 to finish it off, courtesy of Marcus HULK Stoinis! 👊💪
Watch the LIVE action ➡ https://t.co/HQTYFKNWwp
#IPLonJioStar 👉 #SRHvPBKS | LIVE NOW on Star Sports Network & JioHotstar! pic.twitter.com/H3FR1EJGGm— Star Sports (@StarSportsIndia) April 12, 2025
అయితే.. హర్షల్ బౌలింగ్‌లో గ్లెన్ మ్యాక్స్‌వెల్(3).. స్వీప్ షాట్ ఆడబోయి బౌల్డ్ అయ్యాడు. మూడో బంతికి సిల్లీ పాయింట్లో ఆడిన అయ్యర్.. హెడ్‌కు దొరికాడు. అంతే.. చూస్తుండగానే 6 వికెట్లు కోల్పోయింది పంజాబ్. కానీ, మార్కస్ స్టోయినిస్(34 నాటౌట్) షమీ వేసిన 20వ ఓవర్లో విధ్వంసం సృష్టించాడు. వరుసగా 3, 4, 5 బంతుల్ని స్టాండ్స్‌లోకి పంపాడు. ఆఖరి బంతిని సైతం సిక్సర్‌గా మలవడంతో పంజాబ్ నిర్ణీత ఓవర్లలో 245 పరుగులు చేసింది.