WhatsApp Down | ఇన్స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ వాట్సాప్ డౌన్ అయ్యింది. దాంతోయూజర్లు మెసేజ్‌లను పంపడం, రిసీవ్ చేసుకోవడంలో సమస్యలు ఎదుర్కొన్నారు. ఫేస్బుక్, ఎక్స్, ఇతర సోషల్ నెట్వర్కింగ్ సైట్స్‌లో వాట్సాప్ సేవలు చేయకపోవడంతో యూజర్లు పోస్టుల ద్వారా వెల్లడించారు. మధ్యాహ్నం నుంచే మెటా సోషల్ మీడియా యాప్‌లో సమస్యలు రావడం మొదలయ్యాయి. సందేశాలను పంపడంలో, స్టేటస్‌ని అప్లోడ్ చేయడంలో సమస్యలు ఎదురైనట్లు పలువురు తెలిపారు. ఈ క్రమంలో ఎక్స్‌లో మీమ్స్ వెల్లువెత్తాయి.
How X (Twitter) treats #instagram and #WhatsApp when they are down.#whatsappdown
— Neetu Khandelwal (@T_Investor_) April 12, 2025
అయితే, సమస్యపై వాట్సాప్ ఇప్పటి వరకు స్పందించలేదు. మార్క్ జుకర్ బర్గ్ సమస్యను పరిష్కరిస్తున్నారని.. తాము వాట్సాప్ గ్రూప్‌లో మెసేజ్‌లను పంపలేకపోతున్నట్లుగా ఓ యూజర్ స్పందించారు. మరో యూజర్ ‘వాట్సాప్ డౌన్ అయిందా? నేను స్టేటస్‌ను అప్లోడ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాను కానీ అది జరగడం లేదు’ అంటూ ట్వీట్ చేశారు. భారతదేశం, అమెరికా, మెక్సికోతో సహా ప్రపంచంలోని అనేక దేశాల్లో వాట్సాప్‌లో సమస్యలు ఎదురయ్యాయి. ఈ క్రమంలో యూజర్లు సోషల్ మీడియా వేదికగా స్క్రీన్‌షాట్స్‌ని చేశారు.
People running towards twitter to check WhatsApp down or not #whatsappdown pic.twitter.com/28lLazNaYs
— Kichcha Aksh ᴹᵃˣ (@akshathchintu) April 12, 2025
#whatsappdown
Whatsapp down users now😂😂😂😂 pic.twitter.com/4BHQl6ogAO— Bharath Kumar (@Bharathsiva19) April 12, 2025
Mark Zuckerberg to user*#whatsappdown pic.twitter.com/I03Zg33yL4
— विक्रम 𝘬ꪊꪑꪖ𝘳 🦇 (@printf_meme) April 12, 2025