Virat Kohlis Birth Day : భారత పురుషుల క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ (Virat Kohli) పుట్టిన రోజును అభిమానులు వేడుకలా చేకుంటున్నారు. ఎక్స్, ఇన్‌స్టా వేదికగా బర్త్ డే బాయ్ విరాట్‌కు అభినందనలు చెబుతున్నారు. తన చిరస్మరణీయ ఇన్నింగ్స్‌లతో ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న కోహ్లీకి విదేశీయులు సైతం శుభాకాంక్షలు చెబుతున్నారు. ఇటలీకి చెందిన మహిళా ఫుట్‌బాలర్ అగత ఇసబెల్లా (Agata Isabella) కూడా అందరిలానే స్టార్ క్రికెటర్‌కు బర్త్ డే విషెస్ చెప్పింది. అంతే.. ఆమెపై ఆన్లైన్లో ట్రోలింగ్ మొదలైంది.
కోహ్లీ 36వ పుట్టిన రోజు సందర్భంగా అమతి ఇసబెల్లా అతడిని విష్ చేసింది. ఇటలీలోని ఓ అభిమాని తరఫున మీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు. మీకు ఆల్ ది బెస్ట్ అని ఇసబెల్లా ఎక్స్ ఖాతాలో ఓ పోస్ట్ చేసింది. అదే ఆమె చేసిన తప్పు అయింది. ఇక చూసుకోండి.. ఆన్లైన్లో ఆమెను లక్ష్యంగా చేసుకొని కొందరు ట్రోలింగ్ మొదలు పెట్టారు.
@imVkohli, happy birthday from a fan in Italy. All the best to you 🇮🇳🏏 pic.twitter.com/wIk1UXO3eR
— Agata Isabella Centasso (@AgataCentasso) November 5, 2024
అయితే.. ఇసబెల్లా వాళ్లకు గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. ‘నా మీద మీకు అల్పమైన అభిప్రాయం ఉన్నప్పుడు నన్ను ఎందుకు ఫాలో అవుతున్నారు. మీలోని ప్రతికూల ఆలోచనలను పాతరేయండి’ అంటూ ట్రోలర్స్‌కు దిమ్మదిరిగే సమాధానమిచ్చింది. అండర్ -19 వరల్డ్ కప్ హీరోగా జట్టులోకి వచ్చి.. విలువైన ఆటగాడిగా.. సమర్ధుడైన నాయకుడిగా జట్టుపై తన ముద్ర వేసిన కోహ్లీ 36వ వసంతంలో అడుగుపెట్టాడు.
5⃣3⃣8⃣ intl. matches & counting 👌
2⃣7⃣1⃣3⃣4⃣ intl. runs & counting 🙌2⃣0⃣1⃣1⃣ ICC World Cup Winner 🏆
2⃣0⃣1⃣3⃣ ICC Champions Trophy Winner 🏆
2⃣0⃣2⃣4⃣ ICC Men’s T20 World Cup Winner 🏆Here’s wishing Virat Kohli – Former #TeamIndia Captain & one of the finest batters – a very… pic.twitter.com/gh4p3EFCO9
— BCCI (@BCCI) November 5, 2024
క్రికెట్లో దిగ్గజ ఆటగాడిగా నిలిచిపోయే కోహ్లీ 1988 నవంబర్ 5వ తేదీన జన్మించాడు. ఢిల్లీలో నివాసముంటున్న పంజాబీ దంపతులు ప్రేమ్‌నాథ్ కోహ్లీ, సరోజ్ కోహ్లీలు విరాట్ తల్లిదండ్రులు. తండ్రి ప్రేమ్‌నాథ్ ఓ క్రిమినల్ లాయర్. కోహ్లీకి సోదరుడు వికాస్, సోదరి భావన ఉన్నారు.
Happy Birthday to the King, Virat Kohli! May this year bring more strength, records, and unforgettable moments on and off the field. Keep inspiring us, Champ! 🏏👑 @imVkohli #HappyBirthdayViratKohli #ViratKohli pic.twitter.com/0Ny842EMo2
— Col Rajyavardhan Rathore (@Ra_THORe) November 5, 2024
కోహ్లీ బాల్యమంతా ఉత్తమ్ నగర్లోనే గడిచిపోయింది. భారత లెజెండ్ సచిన్ టెండూల్కర్‌ను ఆరాధిస్తూ పెరిగిన కోహ్లీ.. పెద్దయ్యాక అతడి మాదిరిగానే క్రికెటర్ అవ్వాలని కలలు కన్నాడు. అనుకున్నట్టే తన ఫేవరెట్ ఆటగాడితో కలిసి దేశానికి ప్రాతినిధ్యం వహించాడు. అంతేకాదు సచిన్ పేరిట ఉన్న పలు రికార్డులు బ్రేక్ చేసి తానొక ‘చాంపియన్ ప్లేయర్ ‘ అని చాటుకున్నాడు.
ఇక కోహ్లీ వ్యక్తిగత విషయానికొస్తే.. బాలీవుడ్ హీరోయిన్ అనుష్కా శర్మ(Anushka Sharma)ను 2017లో ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఓ షాంపూ యాడ్‌లో కలిసి నటించిన ఈ ఇద్దరూ .. ఆపై ప్రేమ పక్షుల్లా విహరించారు. చివరకు ఇరువురు కుటుంబాలను ఒప్పించి పెండ్లితో ఒక్కటయ్యారు. ఇటలీలోని ఓ రిసార్ట్‌లో వీళ్ల పెండ్లి అంగరంగ వైభవంగా జరిగింది. విరుష్కగా పాపులర్ అయిన ఈ జంటకు వామిక, అకాయ్ అనే పిల్లలు ఉన్నారు.
Virat Kohli with Vamika and Akaay. 🥹❤️
– PICTURE OF DAY…!!! 🙇♂️ pic.twitter.com/2ByzENRB3c
— Mufaddal Vohra (@mufaddal_vohra) November 5, 2024