ATP Finals : ఈ ఏడాది ఆఖర్లో జరుగబోయే ఏటీపీ ఫైనల్స్ కళ తప్పనుంది. ఇటలీలోని టురిన్ వేదికగా నవంబర్ 10 నుంచి జరుగబోయే ఈ టోర్నీకి ఇప్పటికే పలువురు స్టార్లు దూరం కాగా.. ఇప్పుడు మాజీ చాంపియన్ నొవాక్ జకోవిచ్ (Novak Djokovic) సైతం ఈ పోటీల్లో పాల్గొనడం లేదు. గాయం నుంచి పూర్తిగా కోలుకోని జకోవిచ్ టోర్నీ నుంచి వైదొలిగాడు. 2023లో ఏటీపీ ఫైనల్స్ చాంపియన్ అయిన జకో చివరగా షాంఘై మాస్టర్స్‌లో ఆడాడు. ఆ టోర్నీ ఫైనల్లో ఇటలీ కెరటం జన్నిక్ సిన్నర్ చేతిలో ఓడిన అతడు మళ్లీ రాకెట్ పట్టలేదు.
ప్రతిష్ఠాత్మక ఏటీపీ ఫైనల్స్‌కు దూరమవ్వడం తనకు ఎంతో బాధగా ఉందని జకోవిచ్ అన్నాడు. తన కోసం ఎదురుచూసే అభిమానులకు సారీ చెబుతూ టెన్నిస్ లెజెండ్ ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ పెట్టాడు. ‘ఏటీపీ ఫైనల్స్‌కు అర్హత సాధించడం నిజంగా పెద్ద గౌరవం. టురిన్లో ఆడేందుకు నేను ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నా.
As expected, Djokovic has just confirmed on his IG that he won’t be able to play at the ATP tour finals next week. Taking time off to heal his knee properly and some other injury niggles he’s had so he is fit and ready for the 2025 season.
Good and the right decision for me. 👏 pic.twitter.com/g9gXzMcQCO
— Pavvy G (@pavyg) November 5, 2024
అయితే.. గాయం కారణంగా వచ్చే వారం మొదలయ్యే ఆ టోర్నీలో నేను పాల్గొనడం లేదు అని జకోవిచ్ ఓ ప్రకటనలో వెల్లడించాడు. ఏటీపీ ఫైనల్స్‌లో నన్ను చూడాలని కోరుకుంటున్న అభిమానులు క్షమించండి. ఆ టోర్నీలో ఆడనున్న ప్రతి ఒక్కరికీ ఆల్ ది బెస్ట్. మిమ్మల్ని త్వరలోనే కలుస్తాను’ అంటూ జోకర్‌గా పేరొందిన తన పోస్ట్‌లో రాసుకొచ్చాడు. ఈ ఏడాది ఫ్రెంచ్ ఓపెన్ (French Open) సమయంలో జకోవిచ్ మోకాలి కండరాల గాయంతో బాధ పడ్డాడు. ఆ గాయం మళ్లీ తిరగబెట్టడంతో అతడు ఏటీపీ ఫైనల్స్ ఆడకూడదనే నిర్ణయానికి వచ్చాడు.
టెన్నిస్‌లో 24 గ్రాండ్‌స్లామ్స్‌తో చరిత్ర సృష్టించిన జకోవిచ్ ఈ ఏడాది పారిస్ ఒలింపిక్స్‌లో అదరగొట్టాడు. కెరీర్లో తొలి ఒలింపిక్ గోల్డ్ మెడల్‌తో తన కలను నిజం చేసకున్నాడు. అయితే.. అనంతరం జకోవిచ్ పెద్దగా రాణించలేదు. ఒక్కటంటే ఒక్క గ్రాండ్‌స్లామ్ టైటిల్ నెగ్గకపోగా నంబర్ 1 ర్యాంక్ సైతం చేజార్చుకున్నాడు. ఏటీపీ ఫైనల్స్ నుంచి అతడు వైదొలగడంతో సిన్నర్, కార్లోస్ అల్కరాజ్(Carlos Alcaraz), డానిల్ మెద్వెదేవ్, వింబుల్డన్ ఫైనలిస్ట్ టేలర్ ఫ్రిట్జ్‌లు టైటిల్ వేటకు సిద్ధమవుతున్నారు.