Royal Enfield Bear 650 | ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ రాయల్ ఎన్ఫీల్డ్ (Royal Enfield) తాజాగా భారత్ మార్కెట్లోకి రాయల్ ఎన్ఫీల్డ్ బేర్ 650 (Royal Enfield Bear 650) మోటారు సైకిల్ ఆవిష్కరించింది. దీని ధర రూ.3.39 లక్షల (ఎక్స్ షోరూమ్) నుంచి ప్రారంభమై టాప్ హై ఎండ్ బైక్ రూ.3.59 లక్షల (ఎక్స్ షోరూమ్) లకు లభిస్తుంది. రాయల్ ఎన్ఫీల్డ్ ఇంటర్‌సెప్టర్ 650 మాదిరిగానే 650సీసీ ప్లాట్‌ఫామ్‌పై రూపుదిద్దుకున్నది. రాయల్ ఎన్ఫీల్డ్ ఇంటర్‌సెప్టర్ 650లో వలే చేసిస్, ఇంజిన్ ఒక్కటే. సస్పెన్షన్, వీల్స్ మాత్రం డిఫరెంట్.
రాయల్ ఎన్ఫీల్డ్ బేర్ 650 (Royal Enfield Bear 650) మోటారు సైకిల్ ఫ్రంట్‌లో 19-అంగుళాల స్పోక్డ్ వీల్, రేర్‌లో 17-అంగుళాల వీల్ ఉంటాయి. రాయల్ ఎన్ ఫీల్డ్ స్క్రాంబ్లర్‌లో మాదిరిగా 43 ఎంఎం షోవా యూఎస్డీ ఫోర్క్ విత్ 130 ఎంఎం ట్రావెల్ ఉంటుంది. రేర్‌లో 115 ఎంఎం న్యూ షాక్ అబ్జార్బర్స్, ఎంఆర్ఎఫ్ నైలోరెక్స్ టైర్స్ విత్ బ్లాక్ ప్యాటర్న్స్ ఉంటాయి. ముందు 320 ఎంఎం డిస్క్, రేర్‌లో 270 ఎంఎం డిస్క్ అమర్చారు. రాయల్ ఎన్ఫీల్డ్ ఇంటర్‌సెప్టర్ 650లో మాదిరిగానే వైడ్ హ్యాండిల్ బార్, డ్యుయల్ చానెల్ బట్ స్విచ్చబుల్ ఏబీఎస్, ఫుల్ ఎల్ఈడీ లైటింగ్, సర్క్యులర్ టీఎఫ్టీ డిస్ ప్లే, యూఎస్బీ టైప్ సీ చార్జింగ్ పోర్ట్ కూడా ఉంటాయి.
రాయల్ ఎన్ఫీల్డ్ బేర్ 650 మోటారు సైకిల్ ఆయిల్ అండ్ ఎయిర్ కూల్డ్ 648సీసీ పార్లల్ ట్విన్ ఇంజిన్ కలిగి ఉంటుంది. ఈ ఇంజిన్ 7150 ఆర్పీఎం వద్ద 47 హెచ్‌పీ, 5150 ఆర్పీఎం వద్ద 56.5 ఎన్ఎం టార్క్ వెలువరిస్తుంది. ఈ మోటారు సైకిల్ 6-స్పీడ్ గేర్ బాక్స్ తో వస్తోంది. రాయల్ ఎన్ఫీల్డ్ బేర్ 650 మోటారు సైకిల్ ఐదు రంగులు – వైల్డ్ హానీ, పెట్రోల్ గ్రీన్, గోల్డెన్ షాడో, బ్రాడ్ వాక్ వైట్, టూ ఫోర్ నైన్ రంగుల్లో లభిస్తుంది. ఈ నెల 10 నుంచి బుకింగ్స్, టెస్ట్ రైడ్స్ ప్రారంభం అవుతాయి.