Afro – Asia Cup : క్రికెట్లో టీ20 లీగ్స్, లెజెండ్స్ లీగ్స్.. ఇలా రకరకాల లీగ్స్ పాపులర్ అవుతున్నాయి. ఏ టోర్నీ జరిగినా సరే స్టార్ ఆటగాళ్ల బ్యాటింగ్ విన్యాసాలను చూసి అభిమానులు మురిసిపోతున్నారు. దాంతో, కనుమరుగు అయిపోయాయిలే అనుకున్నకొన్ని లీగ్స్ మళ్లీ తెరపైకి వస్తున్నాయి. అలాంటిదే ఆఫ్రో – ఆసియా కప్ (Afro – Asia Cup). భారత్, పాకిస్థాన్ క్రికెటర్లు ఒకే జట్టు తరఫున ఆడే వీలున్న ఈ కప్‌ను నిర్వహించేందుకు ఆఫ్రికా క్రికెట్ సంఘం సిద్ధమవుతోంది. అన్నీ కుదిరితే దాదాపు 20 ఏండ్ల తర్వాత ఈ లీగ్ మళ్లీ ఫ్యాన్స్‌ను అలరించడం ఖాయం.
ఆఫ్రో – ఆసియా కప్‌లో ఆసియా, ఆఫ్రికా దేశాల క్రికెటర్లు జట్టుగా ఏర్పడేవాళ్లు. ప్రతి రెండేండ్లకు ఓసారి ఈ టోర్నీ జరిగేది. ఈ కప్ చివరిసారిగా 2007లో జరిగింది. ఆ తర్వాత ఈ టోర్నీని జరిపేందుకు విశ్వ ప్రయత్నాలు జరిగినా ఏవీ ఫలించలేదు. అయితే.. ఈసారి ఆఫ్రికా క్రికెట్ సంఘం లీగ్ నిర్వహించేందుకు కసరత్తులు చేస్తోంది. అందుకని శనివారం జరిగిన వార్షిక సమావేశంలో ఈ కప్ నిర్వహణ కోసం ఆరుగురితో మధ్యంతర కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ నివేదిక ఆధారంగా ఆఫ్రో – ఆసియా కప్ సాధ్యాసాధ్యాలపై ఏసీఏ ఓ అంచనాకు రానుంది.
The Afro-Asia Cup – played between an Asian XI and African XI could see players from India and Pakistan share the same dressing room 🤝
Full story: https://t.co/U9PPKt8klZ pic.twitter.com/DoxGNZkV5x
— ESPNcricinfo (@ESPNcricinfo) November 5, 2024
‘ఆఫ్రో ఆసియా కప్ ద్వారా క్రికెట్ సంబురం కంటే మా సంస్థకు అవసరమైన ఆదాయం సమకూరుతుంది. అందుకని ఆఫ్రికా క్రికెట్ మండలిలోని బోర్డు సభ్యులతో మేము చర్చలు జరుపుతున్నాం. మా ఆఫ్రికా సహచరులు ఈ కప్ పునరుద్దరణకు కచ్చితంగా అంగీకరిస్తారు’ అని ఏసీఏ మధ్యంతర అధ్యక్షుడు తవెంగ్వా ముకుహ్లనీ వెల్లడించాడు.
తొలిసారిగా 2005లో జరిగిన ఆఫ్రో – ఆసియా కప్ టోర్నీకి దక్షిణాఫ్రికా ఆతిథ్యమిచ్చింది. ఆ తర్వాత 2007లో రెండో ఎడిషన్ భారత్‌లో నిర్వహించారు. అప్పుడు జహీర్ ఖాన్, యువరాజ్ సింగ్, షోయబ్ అక్తర్, మహ్మద్ అసిఫ్‌లతో కూడిన ఆసియా జట్టు చాంపియన్‌గా నిలిచింది. ఇక 2009లో కెన్యా ఈ కప్ ఆతిథ్యానికి సిద్ధపడింది. కానీ, కొన్ని కారణాల వల్ల ఆ ఏడాది టోర్నీ జరుగలేదు.
Afro-Asia Cup (Africa XI vs Asia XI) is set to be revived as per cricinfo.
Lastly, this event was played in 2007, where players from IND, PAK, SL, etc. played for Asia, and players from SA, ZIM, KEN played for Africa.
If revived, up to 80% of the media rights money from the… pic.twitter.com/U3VvTv0Sws
— Ragav 𝕏 (@ragav_x) November 5, 2024
అంతే.. అప్పటినుంచి ఆఫ్రో – ఆసియా కప్ టోర్నీకు ఎండ్ కార్డ్ పడినట్టు అయింది. మళ్లీ ఈ కప్ గనుక జరిగితే.. చిరకాల ప్రత్యర్థులైన భారత్, పాకిస్థాన్ జట్ల నుంచి కొందరేసి చొప్పున కలిసి ఆడే అవకాశముంది. దాయాదుల క్రికెట్ సమరం పంచే మజా కంటే.. ఇరువురు ఒకే జట్టుగా ఆడేతే ఉండే కిక్కే వేరంటున్నారు విశ్లేషకులు. మరి.. ఆరోజు ఎంత త్వరగా వస్తుందో చూడాలి.