తిరుపతి : కార్తీక మాసం సందర్భంగా టీటీడీ ( TTD ) హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో రెండు తెలుగురాష్ట్రాల్లో పలు కార్యక్రమాలను నిర్వహిస్తుంది. ఈనెల 11 నుండి 17వ తేదీ వరకు ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh), తెలంగాణ( Telangana) రాష్ట్రాల్లో ఎంపిక చేసిన శివాలయాల్లో ‘మనగుడి’ (Mana Gudi) కార్యక్రమన్ని నిర్వహిస్తున్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.
ఇందులో భాగంగా ఏపీలోని 26 జిల్లాలు, తెలంగాణలోని 33 జిల్లాల్లో జిల్లాకు ఒకటి చొప్పున ఎంపిక చేసిన శివాలయాల్లో 7 రోజుల పాటు కార్తీకమాస విశిష్టతపై ధార్మికోపన్యాసాలు నిర్వహించనున్నట్లు వివరించారు. ఒక్కో జిల్లాలో 2 చొప్పున ఆలయాలను ఎంపిక చేసి నవంబరు 13న కైశిక ద్వాదశి పర్వదిన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. జిల్లాకు ఒకటి చొప్పున ఎంపిక చేసిన శివాలయాల్లో నవంబరు 15న కార్తీక దీపోత్సవాన్ని జరుపనున్నామని పేర్కొన్నారు.
తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న 74,651 మంది భక్తులు
అమరావతి : తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది . స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో 13 కంపార్టుమెంట్లు నిండిపోగా టోకెన్లు లేని భక్తులకు 10 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ వెల్లడించింది. నిన్న స్వామివారిని 74,651 మంది భక్తులు దర్శించుకోగా 24,712 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా రూ. 4.14 కోట్లు ఆదాయం (Income) వచ్చిందన్నారు.