హైదరాబాద్ : బాలానగర్‌లో విషాదం చోటు చేసుకుంది. కొడుకు సరిగా చదవడం లేదని తల్లి బలవన్మరణానికి(Committed suicide) పాల్పడింది. వివరాల్లోకి వెళ్తే..బాలానగర్‌లోని రాజుకాలనీకి చెందిన గౌడి పుష్పలత(39)కి ఒక కూతురు, ఇద్దరు కొడుకులు ఉన్నారు. ఇంటర్ చదివే రెండో కొడుకు కాలేజీకి వెళ్లకుండా జులాయిగా తిరుగుతుండేవాడు. ఈ విషయంలో తరుచూ భర్తతో పుష్పలత గొడవ పడుతుండేది. కొడుకు చదువు, అప్పులు పెరిగిపోవడంతో మనస్తాపానికి గురైన పుష్పలత ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
ఇవి కూడా చదవండి..
KCR | దాశరథి కృష్ణమాచార్య వర్ధంతి.. నివాళులర్పించిన కేసీఆర్
Harish Rao | 11 నెలల కాంగ్రెస్ పాలనలో 36 మంది రెసిడెన్షియల్ విద్యార్థులు మృతి : హరీశ్‌రావు
Inter Exam Fee | ఇంటర్ ఎగ్జామ్ ఫీజు తేదీలు వచ్చేశాయ్..