Josh Little : ఐర్లాండ్ యువ పేసర్ జోష్ లిటిల్(Josh Little) వన్డే క్రికెట్లో సంచలనం సృష్టించాడు. జింబాబ్వే పర్యటన (Zimbabwe Tour)లో భాగంగా.. హరారే స్పోర్ట్స్ క్లబ్లో శుక్రవారం జరిగిన రెండో వన్డేలో ఈ స్పీడ్‌గన్ ఆరు వికెట్లతో మెరిశాడు. 10 ఓవర్లు వేసిన లిటిల్ 36 పరుగుగులు మాత్రమే ఇచ్చి 6 వికెట్లు పడగొట్టాడు.
తద్వారా వన్డేల్లో ఐర్లాండ్ తరఫున అత్తుత్తమ గణాంకాలు నమోదు చేశాడు. దాంతో, 2017లో పాల్ స్టిర్లింగ్(Paul Stirling) అఫ్గనిస్థాన్‌పై నెలకొల్పిన రికార్డు బద్దలైంది. స్టిర్లింగ్ 10 ఓవర్లలో 55 రన్స్ ఇచ్చి ఆరు వికెట్లు పడగొట్టాడు.
Just look at those figures 😍#BackingGreen ☘️🏏 pic.twitter.com/aHI6ZVtXnx
— Cricket Ireland (@cricketireland) December 15, 2023
తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే జోష్ లిటిల్ దెబ్బకు అల్లాడిపోయింది. ఓపెనర్లు గుంబీ(5), కమున్హుకమ్వే(8)తో మొదలైన అతడి వికెట్ల వేట లోయర్ ఆర్డర్ వరకూ సాగింది. ప్రతి బంతికి వికెట్ తీసేలా కనిపించిన లిటిల్ ప్రమాదకరమైన మిల్టన్ షుంబా(0), సికిందర్ రజా(2)లను వెనక్కి పంపి ఆరు వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. దాంతో, జింబాబ్వే 166 పరుగులకే కుప్పకూలింది. స్వల్ప లక్ష్యాన్ని ఐర్లాండ్ 6 వికెట్లు కోల్పోయి ఛేదించి.. 1-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.
గుజరాత్ టైటాన్స్ జెర్సీలో జోష్ లిటిల్
నిరుడు టీ20ల్లో ఐర్లాండ్ తరఫున హ్యాట్రిక్ నమోదు చేసిన జోష్ లిటిల్.. ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL)లోనూ సత్తా చాటాడు. 16వ సీజన్లో గుజరాత్ టైటాన్స్(Gujarat Titans)కు ఆడిన లిటిల్ సంచలన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. మొత్తంగా 10 మ్యాచుల్లో 7 వికెట్లు పడగొట్టాడు. దాంతో, గుజరాత్ ఈ యంగ్‌స్టర్‌ను 17వ సీజన్‌కు కోసం అట్టిపెట్టుకుంది.