Earthquake | జపాన్‌లో భారీ భూకంపం
Earthquake | జపాన్ (Japan)లో భూకంపం (Earthquake) సంభవించింది. మంగళవారం తెల్లవారుజామున పశ్చిమ జపాన్ తీరంలో భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి.
Earthquake | జపాన్ (Japan)లో భూకంపం (Earthquake) సంభవించింది. మంగళవారం తెల్లవారుజామున పశ్చిమ జపాన్ తీరంలో భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. రిక్టరు స్కేలుపై భూకంపం తీవ్రత 6.2గా నమోదైనట్లు జపాన్ వాతావరణ సంస్థ తెలిపింది. షిమనే ప్రిఫెక్చర్ (Shimane prefecture)లో ఉదయం 10:18 గంటలకు ప్రకంపనలు చోటు చేసుకున్నట్లు పేర్కొంది. అయితే, ఈ ఘటనలో ఇప్పటివరకు ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదని అక్కడి అధికారులు తెలిపారు. అలాగే, ఈ భూకంపం వల్ల సునామీ (tsunami) ముప్పు కూడా లేదని స్పష్టం చేశారు. భూకంపం ధాటికి పలు భవనాలు ఊగిపోయాయి. ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇండ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.
Also Read..
Bangladesh | బంగ్లాదేశ్‌లో దారుణం.. జర్నలిస్టును చంపిన 24 గంటల్లోనే మరో హిందూ వ్యాపారి హత్య
Venezuela | వెనెజువెలా అధ్యక్ష భవనం సమీపంలో కాల్పులు.. భయాందోళనలో ప్రజలు
Robot | రోబోలకు స్పర్శ జ్ఞానం.. నొప్పిని గ్రహిస్తున్న రోబోలు
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

