Robot | రోబోలకు స్పర్శ జ్ఞానం.. నొప్పిని గ్రహిస్తున్న రోబోలు
Robot | చైనా శాస్త్రవేత్తలు ఎలక్ట్రానిక్ స్కిన్‌ను అభివృద్ధి చేశారు. ఇది రోబోలకు స్పర్శ జ్ఞానాన్ని, నొప్పిని అనుభవించే లక్షణాన్ని ఇస్తున్నది. హాంకాంగ్ సిటీ విశ్వవిద్యాలయం ఇంజినీర్ యుయు గావో నేతృత్వంలో ఈ ఈ-స్కిన్‌ను అభివృద్ధి చేశారు.
Robot | బీజింగ్: చైనా శాస్త్రవేత్తలు ఎలక్ట్రానిక్ స్కిన్‌ను అభివృద్ధి చేశారు. ఇది రోబోలకు స్పర్శ జ్ఞానాన్ని, నొప్పిని అనుభవించే లక్షణాన్ని ఇస్తున్నది. హాంకాంగ్ సిటీ విశ్వవిద్యాలయం ఇంజినీర్ యుయు గావో నేతృత్వంలో ఈ ఈ-స్కిన్‌ను అభివృద్ధి చేశారు. మానవ నాడీ వ్యవస్థ మాదిరిగా కచ్చితంగా పని చేసే న్యూరోమార్ఫిక్ టెక్నాలజీ ఆధారంగా దీనిని తయారు చేశారు. ఈ-స్కిన్‌తో తయారైన రోబో ఏదైనా పదునైన లేదా వేడి వస్తువును తన చేతితో తాకితే, వెంటనే తన చేతిని వెనుకకు లాక్కుంటుంది. దీనివల్ల ఆ రోబోకు, దాని సమీపంలోని మానవులకు రక్షణ పెరుగుతుంది. ఈ కృత్రిమ చర్మాన్ని నాలుగు యాక్టివ్ లేయర్స్‌తో తయారు చేశారు. ఎవరైనా ఈ చర్మాన్ని తాకితే, ఆ స్పర్శ ఎలక్ట్రిక్ సిగ్నల్‌గా మారుతుంది. మానవుడి మెదడుకు నరాలు పంపించే సంకేతాల వంటివే ఈ సంకేతాలు కూడా. స్పర్శ ఒత్తిడి తేలికగా ఉంటే, అది సాధారణమైనదేనని రోబో భావిస్తుంది, తన పనిని కొనసాగిస్తుంది. నిర్ణీత పరిమితికి మించి ఒత్తిడి పెరిగితే, దానిని నొప్పిగా గుర్తిస్తుంది, వెంటనే ప్రతిస్పందిస్తుంది.
మెదడు అనుమతి లేకుండానే నిర్ణయం
సాధారణంగా రోబో చేసే ప్రతి పని దాని మెదడు (సెంట్రల్ ప్రాసెసర్) ద్వారా జరుగుతుంది. దీనికి సమయం పడుతుంది. కానీ ఈ-స్కిన్‌లో నేరుగా మార్గాన్ని ఏర్పాటు చేశారు. తీవ్రమైన నొప్పి లేదా హానికరమైన గాయం తగిలిన భావం కలిగితే, ఆ సంకేతాలు రోబో మోటర్స్‌కు నేరుగా హై-ఓల్టేజ్ పల్స్‌ను పంపిస్తాయి. ఫలితంగా రోబో అవయవాలు తక్షణమే స్పందించి, వెనుకకు వెళ్తాయి, దీని కోసం మెదడు నుంచి వచ్చే ఆదేశాల కోసం వేచి చూడవలసిన అవసరం ఉండదు. మానవుడి చెయ్యి వెలుగుతున్న కొవ్వొత్తిని ముట్టుకున్నపుడు ఏ విధంగా వెనుకకు వెళ్తుందో, అదేవిధంగా ఈ రోబో కూడా పని చేస్తుంది. ఈ-స్కిన్ ఎక్కువ కాలం మన్నుతుంది. ఇటుకలతో భవనాన్ని నిర్మించినట్లుగా, చిన్న మ్యాగ్నటిక్ మాడ్యూల్స్‌తో ఇది తయారైంది. ఏదైనా భాగం చెడిపోతే, కొన్ని సెకండ్లలోనే మరమ్మతు చేయవచ్చు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fire accident | కూకట్‌పల్లిలో భారీ అగ్నిప్రమాదం.. షార్ట్ సర్క్యూటే కారణమా?
Horoscope | 09-11-2026 సోమవారం.. మీ రాశి ఫలాలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

