Ireland Cricketer : ఐర్లాండ్‌తో మూడు టీ20 సిరీస్‌లో భారత జట్టు(Team India)కు అదిరే ఆరంభం లభించింది. జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah) సూపర్ స్పెల్‌తో పునరాగమనాన్ని ఘనంగా చాటాడు. అయితే.. ఈ మ్యాచ్‌లో ఐర్లాండ్ ఆటగాడు బ్యారీ మెక్ కార్టీ(Barry McCarthy) టీమిండియాపై అరుదైన రికార్డు నెలకొల్పాడు. 8వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన అతను 150 స్ట్రయిక్ రేటుతో బ్యాటింగ్ చేసి హాఫ్ సెంచరీ కొట్టాడు. దాంతో, లోయర్ ఆర్డర్లో వచ్చి భారత జట్టుపై అత్యధిక వ్యక్తిగత పరుగులు సాధించిన బ్యాటర్‌గా మెక్ కార్టీ రికార్డు సృష్టించాడు. అయితే.. పొట్టి ఫార్మాట్లో మొదటి అర్ధ శతకం బాదిన కార్టీ జట్టును గెలిపించలేకపోయాడు.
డబ్లిన్‌లో జరిగిన మొదటి టీ20లో టాస్ గెలిచిన జస్ప్రీత్ బుమ్రా ఐర్లాండ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. రెండో బంతికే ఓపెనర్ బాల్బిర్నీ(4)ను పెవిలియన్ పంపాడు. 8వ స్థానంలో వచ్చిన మెక్ కార్టీ (51) ధనాధన్ ఆడాడు. 33 బంతుల్లోనే 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో ఫిఫ్టీకి చేరువయ్యాడు. దాంతో, ఆతిథ్య జట్టు 7 వికెట్ల నష్టానికి 137 పరుగులు చేసింది.
Barry McCarthy 👏👏👏
An simply incredible innings to bring up a first T20I fifty.
SCORE: https://t.co/ryMh1qvUER#IREvIND #BackingGreen ☘️🏏 | @JoyEbike pic.twitter.com/4CRc94hMCt
— Cricket Ireland (@cricketireland) August 18, 2023
లక్ష్య ఛేదనలో భారత జట్టు 47 పరుగుల వద్ద ఉండగా వర్షం మొదలైంది. వరుణుడు శాంతించక పోవడంతో, డక్‌వర్త్ లూయిన్(DLS) పద్ధతి ప్రకారం భారత జట్టు గెలుపొందింది. దాంతో, మూడు టీ20ల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఇరుజట్ల మధ్య రెండో టీ20 ఆదివారం జరుగనుంది.