IND – IRE T20 Series : భారత్‌తో టీ20 సిరీస్(T20 Series)కు ఐర్లాండ్(Ireland) సిద్ధమవుతోంది. ఈ దేశ క్రికెట్ బోర్డు ఈ రోజు 15మందితో కూడిన స్క్వాడ్‌ను ప్రకటించింది. మణికట్టు గాయం నుంచి కోలుకున్న లెగ్ స్పిన్నర్ గరెత్ డెలాని(Gareth Delany), ఆల్‌రౌండర్ ఫియోన్ హ్యాండ్(Fionn Hand)లను సెలెక్టర్లు ఎంపిక చేశారు. టీ20 వరల్డ్ కప్ పోటీలకు అర్హత సాధించిన తర్వాత ఐర్లాండ్ ఆడుతున్న తొలి సిరీస్ ఇదే కావడం విశేషం.
‘పొట్టి ప్రపంచ కప్ సన్నాహకాల్లో ఉన్న మాకు ఇది తొలి సిరీస్. మెగా టోర్నీ సమయానికి మేము 15 టీ20లు ఆడుతాం. అందుకని ప్రతి మ్యాచ్‌ను సీరియస్‌గా తీసుకుంటాం. జట్టులో అవసరమైన మార్పులు, మెరుగుపడాల్సిన అంశాలపై దృష్టి సారించాలని అనుకుంటున్నాం’ అని ఐర్లాండ్ సెలెక్టర్ ఆండ్రూ వైట్(Andrew White) ఓ ప్రకటనలో తెలిపాడు.
📡: SQUAD NAMED
A 15-player squad has been named for Ireland Men’s T20I series against India: https://t.co/NjkD4z6rbB
Want to buy tickets? Get in quick! https://t.co/r5l3ODnEpp
Hospitality packages are also available: https://t.co/9U59GsaZHL#BackingGreen ☘️🏏 pic.twitter.com/SdV3pL0Qtw
— Cricket Ireland (@cricketireland) August 4, 2023
ఐర్లాండ్ స్క్వాడ్ : పాల్ స్టిర్లింగ్(కెప్టెన్), ఆండ్రూ బల్బిర్నే, మార్క్ అడెయర్, రాస్ అడెర్, కర్టిస్ చాంఫర్, గరెత్ డెలాని, జార్జ్ డాక్రెల్, ఫియొన్ హ్యాండ్, జోష్ లిటిల్, బ్యారీ మెక్‌కార్తీ, హ్యారీ టెక్టర్, లొర్కాన్ టక్కర్, థియో వాన్ వొర్కమ్, బెన్ వైట్, క్రేగ్ యంగ్.
ఆగస్టు 18న భారత్, ఐర్లాండ్ మధ్య మూడు టీ20ల సిరీస్ ప్రారంభం కానుంది. ఈమధ్యే ఫిట్నెస్ సాధించిన పేసర్ జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah) ఈ సిరీస్‌తో పునరాగమనం చేస్తున్నాడు. దాదాపు ఏడాది తర్వాత అంతర్జాతీయ మ్యాచ్ ఆడుతున్న ఈ యార్కర్ల కింగ్ ఐర్లాండ్ పర్యటనలో భారత జట్టును నడిపించనున్నాడు. నిరుడు ఆసియా కప్(Asia Cup 2022)లో వెన్నెముక గాయం తిరగబెట్టడంతో బుమ్రా ఆటకు దూరమయ్యాడు.
పాల్ స్టిర్లింగ్, జస్ప్రీత్ బుమ్రా
న్యూజిలాండ్‌లో సర్జరీ చేయించుకున్న అతను బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ(NCA)లో కోలుకున్నాడు. ఫిట్నెస్ కోసం రోజుకు గంటల కొద్దీ బౌలింగ్ ప్రాక్టీస్ చేశాడు. వన్డే వరల్డ్ కప్‌లోపు బుమ్రా రాటుదేలడం కోసం బీసీసీఐ ఈ సిరస్ ప్లాన్ చేసింది. ఇప్పటికే అజిత్ అగార్కర్(Ajit Agarkar) నేతృత్వంలోని సెలెక్టర్లు టీమిండియా స్క్వాడ్‌ను ప్రకటించారు.