కోరుట్ల, జనవరి 1: జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణ శివారులోని తెలంగాణ మైనార్టీ గురుకుల రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల విద్యార్థి వంతడుపుల పార్థసారథి జాతీయ స్థాయి ఖోఖో టోర్నీకి ఎంపికయ్యాడు.
ఇంటర్ ఎంఈసీ మొదటి సంవత్సరం చదువుతున్న పార్థసారథి ఇటీవల మెదక్ జిల్లాలో జరిగిన అండర్-18 సబ్ జూనియర్స్ ఖోఖో పోటీల్లో ప్రతిభ కనబర్చి బెంగుళూరులో జరిగే జాతీయ స్థాయి టోర్నీకి ఎంపికైనట్లు ప్రిన్సిపాల్ శంకర్ తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థిని పీఈటీ రాజేశ్, ఉపాధ్యాయులు అభినందించారు. ఈ టోర్నీలో ఈనెల 3, 4 తేదీల్లో సెమీఫైనల్, ఫైనల్ జరుగనున్నాయి.