Tilak Varma : గత ఏడాది కాలంగా నిలకడగా రాణిస్తున్న తిలక్ వర్మ (Tilak Varma)కు తగిన గౌరవం దక్కింది. ఈమధ్యే ఇంగ్లండ్ గడ్డపై జరిగిన కౌంటీల్లో ఇరగదీసిన అతడు సౌత్ జోన్ (South Zone) జట్టుకు కెప్టెన్‌గా నియమితులయ్యాడు. ఐపీఎల్ ఫామ్, ఒత్తిడిలోనూ కీలక ఇన్నింగ్స్‌లు ఆడగల నైపుణ్యం కలిగిన తిలక్‌ను ఆదివారం సెలెక్టర్లు తిలక్‌ను సారథిగా ప్రకటించారు. త్వరలో ప్రారంభం కాబోయే రంజీ సీజన్లో మొదటిదైన దులీప్ ట్రోఫీ (Duleep Trophy)లో ఈ యంగ్‌స్టర్ సౌత్ జోన్ జట్టును నడిపించనున్నాడు.
ఆగస్టు 28 నుంచి దులీప్ ట్రోఫీ షురూ కానుంది. బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ మైదానంలో మ్యాచ్‌లు జరుగనున్నాయి. నాలుగు రోజుల మ్యాచ్‌ల ఈ టోర్నీలో ఆరు జట్లు తలపడనున్నాయి. అయితే.. సౌత్ జోన్, వెస్ట్ జోన్ నేరుగా సెమీఫైనల్‌కు అర్హత సాధించిన విషయం తెలిసిందే. మిగిలిన రెండు స్థానాల కోసం నార్త్ జోన్, ఈస్ట్ జోన్, సెంట్రల్, నార్త్ ఈస్ట్ జట్ల మధ్య గట్టిపోటీ నెలకొంది. క్వార్టర్ ఫైనల్లో నార్త్ జోన్, ఈస్ట్ జోన్ ఢీకొననుండగా.. సెంట్రల్, నార్త్ ఈస్ట్ అమీతుమీ తేల్చుకోనున్నాయి.
Tilak Varma scored a 💯 in the County Championship pic.twitter.com/eZeiEwzlIJ
— Cricbuzz (@cricbuzz) July 25, 2025
సౌత్ జోన్ స్క్వాడ్ : తిలక్ వర్మ(కెప్టె్న్), మహ్మద్ అజారుద్దీన్(వైస్ కెప్టెన్), తన్మయ్ అగర్వాల్ దేవ్‌దత్ పడిక్కల్, మోహిత్ కాలే, సల్మాన్ నిజర్, నారాయణ్ జగదీశన్, టీ.విజయ్, సాయి కిశోర్, తన్మయ్ త్యాగరాజన్, వైషాక్ విజయ్ కుమార్, ఎండీ నిదీశ్, రికీ భుయీ, బసిల్ ఎన్పీ, గుర్జన్‌పీత్ సింగ్, స్నేహల్ కౌథంకర్.
ఐపీఎల్లో ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న తిలక్ కౌంటీల్లోనూ తన బ్యాట్ పవర్ చూపించాడు. తొలిసారి ఇంగ్లండ్ క్లబ్ జట్టకు ఆడిన అతడు హ్యాంప్‌షైర్(Hampshire) తరఫున మెరుపులు మెరిపించాడు. నాలుగు ఇన్నింగ్స్‌ల్లో ఈ చిచ్చరపిడుగు రెండు శతకాలు, ఒక హాఫ్ సెంచరీతో పాటు 47 రన్స్‌తో రాణించాడు. ఈ ఏడాది సునామీలా చెలరేగిన ఈ యువకెరటం టీ20ల్లో హ్యాట్రిక్ సెంచరీలతో రికార్డు నెలకొల్పిన విషయం తెలిసిందే.