TCS : కృత్రిమ మేధ (AI) రాకతో ప్రయోజనాల సంగతి ఏమోగానీ ఐటీ ఉద్యోగాలపై దీని ప్రభావం మాత్రం గట్టిగానే పడుతోంది. ఏఐ పుణ్యమాని ఇప్పటికే పలు దిగ్గజ సంస్థలు తమ స్టాఫ్‌ను తగ్గించుకుంటున్నాయి. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) సైతం భారీగా ఉద్యోగాల కోత (Lay Offs)కు సిద్ధమైంది. వచ్చే ఏడాది వరకూ తమ స్టాఫ్‌లో 1,200 వేల మందిని తొలగించనుందీ కంపెనీ. ప్రధానంగా మధ్య స్థాయి, సీనియర్ హోదాలోని వాళ్లను ఇంటికి పంపేందుకు సన్నాహకాలు చేస్తున్నట్టు ఆదివారం మనీ కంట్రోల్ వార్తా సంస్థతో కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ కే.కృతివాసన్ వెల్లడించారు.
ఐటీ రంగంలో ఏఐతో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయి. అందులో ఉద్యోగాల్లో కోత కూడా ఒకటి. మెటా సహ పలు సంస్థలు లే ఆఫ్స్ ప్రకటిస్తుండగా.. భారత కంపెనీ టీసీఎస్ కూడా తమ సిబ్బందిని 2 శాతానికి తగ్గించుకునే పనిలో నిమగ్నమైంది. వచ్చే ఏడాది వరకూ దాదాపు 12 వేల మందిని తొలగించేందుకు ప్రణాళికలు చేస్తోంది టీసీఎస్.
The AI threat is not coming anymore.
Its already here.
In a massive corporate story on a Sunday afternoon, TCS decides to layoff more than 12,000 people that will have huge ramifications in the Indian IT Sector.
The layoffs would be, “primarily at Middle and Senior Levels… pic.twitter.com/rsEywzwAnF
— Indranil Roy 🇮🇳 (@indraroy) July 27, 2025
The AI threat is not coming anymore.
Its already here.
In a massive corporate story on a Sunday afternoon, TCS decides to layoff more than 12,000 people that will have huge ramifications in the Indian IT Sector.
The layoffs would be, “primarily at Middle and Senior Levels… pic.twitter.com/rsEywzwAnF
— Indranil Roy 🇮🇳 (@indraroy) July 27, 2025
‘ఐటీ రంగంలో ఈమధ్య చాలా మార్పులు వస్తున్నాయి. కృత్రిమ మేధ, ఆపరేటింగ్ మోడల్ మార్పులు ఇలా కొత్త సాంకేతికత పుట్టుకొచ్చింది. అందుకు అనుగుణంగానే ఎవరైనా నడుచుకోవాలి. అందుకే లే ఆఫ్స్‌కి సిద్దమవుతున్నాం. అలా అనీ మాకు తక్కువ మందే కావాలని నేను చెప్పడం లేదు. ఇది కేవలం ఒక సర్దుబాటు చర్య మాత్రమే. తొలగించిన వాళ్లకు వేతనంతో పాటు మంచి ప్యాకేజీ ఇస్తాం. నోటీస్ పీరియడ్ సమయానికి జీతం చెల్లిస్తాం. వీటితో పాటు ఆరోగ్య బీమాను కొనసాగిస్తూనే వాళ్లు ఇతర సంస్థల్లో ఉద్యోగం సాధించడానికి అవసరమైన సహకారం అందిస్తాం’ అని కృతివాసన్ పేర్కొన్నారు.