Khammam | కారేపల్లి, జూలై 27 (కామేపల్లి): ఖమ్మం జిల్లా కామేపల్లి మండల పరిధిలోని ఖమ్మం ఇల్లందు ప్రధాన రహదారిపై ఆదివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. అందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కారేపల్లి మండలం గిద్దెవారిగూడెం గ్రామానికి చెందిన గూగులోతు రాజశేఖర్, రఘునాధపాలెం మండలం బూడిదంపాడు గ్రామానికి చెందిన కేలోత్ మంగీలాలు కలిసి మోటార్ సైకిల్ పై ఖమ్మం వైపు వెళ్తున్నారు. ముచ్చర్ల కొత్త లింగాల స్టేజి మార్గమధ్యలో నర్సరీ సమీపంలో ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో రాజశేఖర్ తలకు తీవ్ర గాయాలు కాగా మంగీలాల్‌కు స్వల్ప గాయాలయ్యాయి. సంఘటన స్థలానికి చేరుకున్న కామేపల్లి పోలీసులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. అనంతరం ప్రమాదానికి కారణమైన వాహనాలను పోలీసు స్టేషన్‌కు తరలించారు.