Shruti Haasan | సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లు కెరీర్ తొలినాళ్లలో నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద సరిగా ఆడకపోతే వారి కెరీర్‌కు బ్రేక్ పడిపోతుంది. కొంతమంది అలాంటి హీరోయిన్లను సినిమా ఫెయిల్యూర్లకు భాద్యులను చేస్తూ వారిని ఐరన్ లెగ్ అని ముద్ర వేసేస్తారు. ఇలాంటి ట్రోల్స్‌ను ఎదుర్కొన్న నటీమణుల్లో టాప్‌లో ఉంటుంది మల్టీ టాలెంటెడ్ బ్యూటీ శృతిహాసన్ (Shruti Haasan). కెరీర్ మొదట్లో బ్యాక్ టు బ్యాక్ ఫెయిల్యూర్లు వచ్చినా.. అవకాశాలు మాత్రం కోల్పోలేదు. గబ్బర్ సింగ్ సినిమా హిట్‌తో సూపర్ బ్రేక్ అందుకుంది.
ఈ సినిమా సినీ జనాలకు శృతిహాసన్పై ఉన్న నెగెటివ్ ఇంప్రెషన్ చెరిగిపోయేలా చేసింది. ఇక అటు నుంచి ఈ భామ వెనక్కి తిరిగి చూసుకునే అవసరం లేకుండా పోయింది. తన గత సినిమాలకు సంబంధించిన నెగెటివిటీని పక్కనపెట్టి గబ్బర్ సింగ్‌లో అవకాశమిచ్చిన పవన్ కల్యాణ్, హరీష్ శంకర్‌కు ధన్యవాదాలు తెలిపింది శృతిహాసన్. ఆ ఒక్క సినిమా తన కెరీర్‌ను మార్చేసిందని చెప్పింది. తనను అదృష్టవంతురాలని కానీ.. దురదృష్టవంతురాలని కానీ పిలవడం ఇష్టముండదు. నా పనిని ఎంజాయ్ చేసే ఓ నటిగా నన్ను నేను చూసుకోవాలనుకుంటున్నా. తనకు సినిమా అంటే చాలా ఇష్టమని.. తన ప్రయాణానికి మద్దతుగా నిలిచిన ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నానంది.
3 సినిమా బాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్ టాక్ తెచ్చుకోవడం గురించి మాట్లాడుతూ.. ఆ సినిమా ఈ రోజుల్లో విడుదలైతే పెద్ద విజయం సాధించేది. పాన్ ఇండియా సినిమాలు ఇప్పుడు సాధారణం అయిపోయాయి. కొలవెరి పాట భారీ హిట్టయినట్టే.. సినిమా కూడా ఇప్పుడు చాలా మంది ప్రేక్షకులను ఇంప్రెస్ చేసేదంటూ చెప్పుకొచ్చింది.
Saanve Megghana | నటి శాన్వీ మేఘన ఇంట్లో వరలక్ష్మీ వ్రతం వేడుక!.. ‘హారతి తీసుకోండంటూ’ పోస్ట్
Constable Kanakam | ఓటీటీలోకి ‘కానిస్టేబుల్ కనకం’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే.!
Shobha Shetty | హీరో సుదీప్తో బిగ్ బాస్ బ్యూటీకి గొడవ ఏంటి.. క్లారిటీ ఇచ్చిన శోభా శెట్టి