IND vs BAN : అంతర్జాతీయ వన్డేల్లో తొలి డబుల్ సెంచరీ నమోదైన గ్వాలియర్ స్టేడియం గుర్తుందా.. 2010లో దక్షిణాఫ్రికాపై సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) శివతాండవం చేస్తూ ద్విశతకంతో రికార్డు సృష్టించాడు. మాస్టర్ బ్లాస్టర్ తన క్లాస్ ఇన్నింగ్స్‌లతో అభిమానులను అలరించిన అదే స్టేడియంలో 14 ఏండ్ల తర్వాత తొలి మ్యాచ్ జరుగుతోంది. అది కూడా పొట్టి ఫార్మాట్లో. భారత్, బంగ్లాదేశ్‌ల మధ్య మూడు టీ20ల సిరీస్‌లో మొదటి మ్యాచ్‌కు గ్వాలియర్ స్టేడియమే వేదిక.
సచిన్ రికార్డు డబుల్ సెంచరీకి సాక్ష్యంగా నిలిచిన ఈ స్టేడియంలోనే ఇండియన్ ప్రీమియర్ లీగ్ హీరోలు నితీశ్ కుమార్ రెడ్డి (Nitish Kumar Reddy), పేసర్ మయాంక్ యాదవ్(Maynak Yadav)లు టీ20ల్లో అరంగేట్రం చేశారు. మ్యాచ్‌కు ముందు ఈ ఇద్దరూ డెబ్యూట్ క్యాప్ అందుకున్నారు.
Say Hello to #TeamIndia‘s Debutants here in Gwalior 😃👋
Congratulations to Mayank Yadav and Nitish Kumar Reddy! 🧢
Live – https://t.co/Q8cyP5jpVG#INDvBAN | @IDFCFIRSTBank pic.twitter.com/yQo3DtXZUL
— BCCI (@BCCI) October 6, 2024
ఐపీఎల్ 17వ సీజన్లో తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి అద్బుతంగా రాణించాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టాడు. పలు మ్యాచుల్లో ఒత్తిడిలోనూ కీలక ఇన్నింగ్స్‌లు ఆడననితీశ్ టీ20లకు పక్కాగా సరిపోతాడని భ సెలెక్టర్లు భావించారు. ఇంకేముంది .. టీ20 వరల్డ్ కప్ అనంతరం జింబాబ్వే పర్యటన(ZimbabweTour)కు అతడు ఎంపికయ్యాడు. అయితే.. గాయం కారణంగా నితీశ్ ఆ సిరీస్ ఆడలేదు. దాంతో, అతడి స్థానంలో శివం దూబే జట్టుతో కలిశాడు.
అందుకని అతడికి సెలెక్టర్లు మరో అవకాశం ఇస్తూ.. బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌కు ఎంపికచేశారు.
ఇక మయాంక్ యాదవ్ విషయానికొస్తే గంటకు 153 కిలోమీటర్ల వేగంతో బంతులు సంధించగల నేర్పరి. ఐపీఎల్ 17వ సీజన్లో ఆడింది రెండు మ్యాచ్‌లే అయినా మయాంక్ తన పేస్‌తో ప్రత్యర్థులను భయ పెట్టాడు. పంజాబ్ కింగ్స్(Punjab Kings)పై.. 3/27 ఆ తర్వాత రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుపై 3/14తో ఔరా అనిపించాడు. నిలకడగా రాణించి భావి పేసర్ దొరికాడనే ప్రశంసలు అందుకున్నాడు. అయితే.. గాయం కారణంగా ఇన్నాళ్లు విశ్రాంతి తీసుకున్న మయాంక్ దేశం తరఫున తొలి టీ20 ఆడే అవకాశం దక్కించున్నాడు.
3⃣, 2⃣, 1⃣ & Let’s Play!
Action Time in Gwalior 😎
Live – https://t.co/Q8cyP5jXLe#INDvBAN | @IDFCFIRSTBank pic.twitter.com/oewhxDke6F
— BCCI (@BCCI) October 6, 2024