Bigg Boss Subhashree | బిగ్‌బాస్-7 ఫేమ్ శుభశ్రీకి ప్రమాదం.. తాగిన మైకంలో ఢీకొట్టిన బైకర్..!
Bigg Boss Subhashree | బిగ్‌బాస్-7 ఫేమ్ శుభశ్రీ ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. నాగార్జున సాగర్ మార్గంలో వెళ్తున్న సమయంలో ఆమె కారును ఓ ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. మద్యం మద్దులో ఉన్న బైకర్స్ ఆమె కారును ఢీకొట్టినట్లు సమాచారం.
Bigg Boss Subhashree | బిగ్‌బాస్-7 ఫేమ్ శుభశ్రీ ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. నాగార్జున సాగర్ మార్గంలో వెళ్తున్న సమయంలో ఆమె కారును ఓ ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. మద్యం మద్దులో ఉన్న బైకర్స్ ఆమె కారును ఢీకొట్టినట్లు సమాచారం. ప్రమాదం జరిగిన సమయంలో హెల్మెట్ ధరించడంతో స్వల్ప గాయాలతో బయటపడ్డట్లు తెలుస్తున్నది. కారులో ఉన్న శుభశ్రీకి ఎలాంటి గాయాలు కాలేదు కానీ.. కారు మాత్రం ముందుభాగం నుజ్జునుజ్జు అయ్యింది. ఆమె ప్రయాణిస్తున్న కారు తనది కాదని.. ఓ ప్రొడక్షన్ హౌస్‌కు చెందినదిగా సమాచారం.
శుభశ్రీ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైందని తెలిసి అభిమానులు ఆందోళనకు గురయ్యారు. నటికి ప్రమాదంలో ఏమీ కాలేదని తెలిసి ఊపిరిపీల్చుకున్నారు. ప్రమాదంలో గాయపడ్డ వారిని ఆసుప్రతికి తరలించారు. శుభశ్రీ పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా చేస్తున్నది. బిగ్‌బాస్-7 సీజన్లో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చి.. భారీగా అభిమానులను సంపాదించుకున్నది. ప్రస్తుతం శుభశ్రీ హీరోయిన్గా ఓ సినిమా చేస్తుంది. అలాగే, పవన్ కల్యాణ్ నటిస్తున్న సినిమాలోనూ ఛాన్స్ దక్కించుకున్నది. సుజిత్ దర్శకత్వంలో వస్తున్న ఓజీ సినిమాలో ఛాన్స్ వచ్చింది. ఈ మూవీలో శుభశ్రీ ఓ పాత్ర చేయబోతున్నది.
While Going for “Bhim Bhumi Ki Jai” shoot, heroine Subhashree Rayaguru car got into an accident. She is absolutely fine. With Grace of God nobody got harmed. The opposite side bike rider was fully drunk & hit the car straight from the opposite. pic.twitter.com/AGGuZCmUsl
— The Pioneer South (@FeaturesPioneer) October 6, 2024
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

