Bathukamma – Japan | హైదరాబాద్, అక్టోబర్ 6 (నమస్తే తెలంగాణ) : జపాన్ తెలుగు సమాఖ్య ఆధ్వర్యంలో జపాన్ రాజధాని టోక్యోలో బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక కోమట్సుగావా పార్క్లో నిర్వహించిన ఈ ఉత్సవాల్లో సుమారు 150మంది మహిళలు, పిల్లలు పాల్గొన్నారు. సాంప్రదాయ వస్త్రధారణతో మహిళలు రంగురంగుల పూలతో పేర్చిన బతుకమ్మలతో ఆడిపాడారు.
జపాన్ రాజధాని నగరం టోక్యోలోని వివిధ ప్రాంతాల్లో ఉంటున్న తెలుగు మూలాలున్న ప్రజలు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకొని సందడి చేశారు. తక్కువ సమయంలోనే సాధ్యమైనంత ఎక్కువమందిని పాల్గొనేలాచేసి వేడుకలను విజయవంతం చేసినట్లు సమాఖ్య వాలంటీర్ మురళీధర్ తెలిపారు.