Rinku Singh : ఒకే ఓవర్లో ఐదు సిక్సర్లతో హీరో అయిన రింకూ సింగ్ (Rinku Singh)ను కోల్‌కతా నైట్ రైడర్స్ భారీ ధరకు అట్టిపెట్టుకున్న విషయం తెలిసిందే. మెరుపు ఇన్నింగ్స్‌లతో చెలరేగే రింకూను కోల్‌కతా రూ.13 కోట్లకు రీటైన్ చేసుకుంది. ఫ్రాంచైజీ నుంచి భారీ సొమ్ము రానుండడంతో ఈ లెఫ్ట్ హ్యాండర్ తన కొత్త ఇంటి కలను సాకారం చేసుకున్నాడు. ఈ సందర్భంగా సదరు గృహనిర్మాణ సంస్థ అధికారులు ఇంటి తాళాలను రింకూకు అందజేశారు. ఈ రోజుతో నా కలల ఇల్లు సొంతమైంది అంటూ రింకూ పోస్ట్ చేశాడు.
ఉత్తరప్రదేశ్‌లోని గోల్డెన్ ఎస్టేట్‌లో ఉన్న ఓజోన్ సిటీలో రింకూ ఇల్లు కొన్నాడు. 500 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఇల్లుకోసం రింకూ భారీగానే ఖర్చు పెట్టాడట. అయితే.. ఎంతకు కొన్నాడనే విషయం మాత్రం తెలియలేదు. ప్రస్తుతం రింకూ కొనుగోలు చేసిన ఇంటి ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
रिंकू सिंह का ओजोन वैली अलीगढ़ में नया मकान 🪔
रिंकू सिंह जिनके पिता ओजोन वैली में गैस सिलेंडर सप्लाई करते थे ।
आज वही ओजोन वैली में 3.50 करोड़ का मकान खरीदा है।
हाल ही में KKR ने रिंकू सिंह को 13 करोड़ में रिटेन किया है।#rinkusingh #KKR pic.twitter.com/gp0JswToV2— 𝐏𝐚𝐫𝐯𝐞𝐬𝐡 𝐜𝐡𝐚𝐮𝐝𝐡𝐚𝐫𝐲🇮🇳 (@MeRanaParvesh) November 3, 2024
ఐపీఎల్ పదహారో సీజన్(IPL 2023)లో కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున రింకూ ఆడిన తీరు అమోఘం. సంచలన ఇన్నింగ్స్‌తో ఈ చిచ్చరపిడుగు భారత జట్టుకు ఎంపికయ్యాడు. ఫినిషర్‌గా తన మార్క్ ఇన్నింగ్స్‌లతో అలరించిన రింకూ.. శ్రీలంక పర్యటనలో బంతితోనూ మ్యాజిక్ చేశాడు. దాంతో, 18వ సీజన్లో కోల్‌కతా అతడిపై భారీ ఆశలే పెట్టుకుంది. అందుకని రింకూను రూ.13 కోట్లకు రీటైన్ చేసుకుంది.
ఐపీఎల్ మెగా వేలం నవంబర్ 24, 25వ తేదీల్లో వేలం జరుగనుంది. సౌదీ అరేబియాలోని రియాద్‌లో కాకుండా జెడ్డా నగరంలో వేలం ప్రక్రియ నిర్వహించేందుకు సిద్దమవుతోంది. ఈసారి మెగా వేలం కోసం 1,574 మంది క్రికెటర్లు పేర్లు నమోదు చేసుకున్నారని ఐపీఎల్ పాలక వర్గం ఎక్స్ వేదికగా వెల్లడించింది.