Harish Rao | హైదరాబాద్ : సాక్షాత్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలోనే నియామకపత్రం అందుకున్నా, ప్రభుత్వ ఉద్యోగం మాత్రం దక్కని విచిత్రమైన పరిస్థితి ఓ యువతికి ఎదురైందని మాజీ మంత్రి హరీశ్‌రావు ఎక్స్ వేదికగా తెలిపారు. ఎంతో కష్టపడి చదివి స్కూల్ అసిస్టెంట్‌తో పాటు, ఎస్జీటీ ఉద్యోగానికి ఎంపికైనప్పటికీ టీచర్ కావాలన్న కలను మాత్రం నెరవేర్చుకోలేని దుస్థితి ఆమెది అని పేర్కొన్నారు.
ప్రభుత్వ నిర్లక్ష్యం, అధికారుల అలసత్వం కారణంగా నిజామాబాద్ జిల్లాకు చెందిన యువతి చిరకాల స్వప్నం చెదిరిపోయేందుకు కారణమవుతుండటం శోచనీయమన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి, అన్ని విధాల అర్హురాలైన రచనకు టీచర్ ఉద్యోగం కల్పించి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నామని హరీశ్‌రావు పేర్కొన్నారు.
సాక్షాత్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలోనే నియామకపత్రం అందుకున్నా, ప్రభుత్వ ఉద్యోగం మాత్రం దక్కని విచిత్రమైన పరిస్థితి.
ఎంతో కష్టపడి చదివి స్కూల్ అసిస్టెంట్ తో పాటు, ఎస్జీటీ ఉద్యోగానికి ఎంపికైనప్పటికీ టీచర్ కావాలన్న కలను మాత్రం నెరవేర్చుకోలేని దుస్థితి.
ప్రభుత్వ… pic.twitter.com/vK5IJsOu2p
— Harish Rao Thanneeru (@BRSHarish) November 5, 2024
ఇవి కూడా చదవండి..
Harish Rao | రెసిడెన్షియల్ స్కూళ్లకు కూడా రేవంత్ రెడ్డి రాజకీయ రంగు పులిమారు.. హరీశ్‌రావు ధ్వజం
KTR | కేవలం బ్లాక్ మెయిల్ దందా కోసమే ‘హైడ్రా’.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
KTR | తెలంగాణలో భూముల విలువ ఛూమంతర్ అనగానే పెరగలేదు : కేటీఆర్