IPL Mega Auction : ఐపీఎల్ మెగా వేలం తేదీలపై, వేదికపై స్పష్టత వచ్చేసింది. ఇప్పటికే నవంబర్ 24, 25వ తేదీల్లో వేలం జరుగనుందని చెప్పిన బీసీసీఐ (BCCI) మంగళవారం వేదికను ఖరారు చేసింది. సౌదీ అరేబియాలోని రియాద్‌లో కాకుండా జెడ్డా (Jeddah) నగరంలో వేలం ప్రక్రియ నిర్వహించేందుకు సిద్దమవుతోంది. ఈసారి మెగా వేలం కోసం 1,574 మంది క్రికెటర్లు పేర్లు నమోదు చేసుకున్నారని ఐపీఎల్ పాలక వర్గం ఎక్స్ వేదికగా వెల్లడించింది. అయితే.. వీళ్లలో ఏ దేశం నుంచి ఎంతమంది ఉన్నారో తెలుసా..?
పద్దెనిమిద్ సీజన్ మెగా వేలంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో 1,574 మంది క్రికెటర్లు పేర్లు రిజిష్టర్ చేసుకున్నారు. వీళ్లలో 1,165 మంది భారత ఆటగాళ్లు ఉండగా.. విదేశాల నుంచి 409 మంది ఉన్నారు. వీళ్లలో అత్యధికంగా 91 మంది దక్షిణాఫ్రికా ఆటగాళ్లే ఉన్నారు. ఆస్ట్రేలియా నుంచి 76 మంది, ఇంగ్లండ్ నుంచి 52 మంది క్రికెటర్లు ఐపీఎల్ వేలంలో పాల్గొంటున్నారు. న్యూజిలాండ్ క్రికెటర్లు 39 మంది, వెస్టిండీస్ ఆటగాళ్లు 33 మంది వేలంలో తమ పేర్లు రిజిష్టర్ చేసుకున్నారు.
✍️ 1574 Player Registrations
🧢 320 capped players, 1,224 uncapped players, & 30 players from Associate Nations
🎰 204 slots up for grabs
🗓️ 24th & 25th November 2024
📍 Jeddah, Saudi Arabia
Read all the details for the upcoming #TATAIPL Mega Auction 🔽🤩
— IndianPremierLeague (@IPL) November 5, 2024
అఫ్గనిస్థాన్ దేశస్థులు 29 మంది, శ్రీలంక తరఫున కూడా 29 మంది క్రికెటర్లు వేలంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. బంగ్లాదేశ్ నుంచి 13, కెనడా నుంచి నలుగురు, ఐర్లాండ్ నుంచి 9 మంది వేలంలో పొల్గొంటుండగా.. నెదర్లాండ్స్ క్రికెటర్లు 12 మంది రేసులో నిలిచారు. ఇక స్కాట్లాండ్ తరఫున ఇద్దరు, అమెరికా నుంచి 10, జింబాబ్వే నుంచి 8 మంది ఆటగాళ్లు వేలంలో ఉన్నారు.
The wait is over and the retentions are 𝙃𝙀𝙍𝙀! 🔥
Here are all the players retained by the 🔟 teams ahead of the #TATAIPL Auction 💪
What do you make of the retention choices 🤔 pic.twitter.com/VCd0REe5Ea
— IndianPremierLeague (@IPL) October 31, 2024
ఈసారి వేలంలో 320 మంది క్యాప్డ్ ఆటగాళ్లు, 1,224 మంది అన్క్యాప్డ్ ప్లేయర్లు, అసోసియేట్ దేశాలకు చెందిన 30 మంది క్రికెటర్లు ఉన్నారు. అయితే.. వేలంలో 204 మంది ఆటగాళ్లను మాత్రమే అమ్ముడుపోయే వీలుందని బెర్తులు ఖాళీగా ఉన్నాయని ఐపీఎల్ యాజమాన్యం తమ పోస్ట్‌లో తెలిపింది. వేలం తర్వాత ప్రతి ఫ్రాంచైజీ స్క్వాడ్‌లో 25 మంది క్రికెటర్లు ఉంటారు.