Dasarathi Krishnamacharya | చిన్నగూడూరు : ‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అని ఎలిగెత్తి చాటి నిజాం పాలకులను గడగడలాడించిన దాశరథి కృష్ణమాచార్యులను కాంగ్రెస్ పాలకులు మరిచారు. మంగళవారం ఆయన వర్ధంతి కాగా, స్మరించుకునే వారే కరువయ్యారు.
మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరులో జన్మించిన దాశరథికి గ్రామస్తులు అభిమానంతో విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నారు. మండలంలో వివిధ రాజకీయ ప్రముఖులు సభలు, సమావేశాల్లో దాశరథి స్ఫూర్తి ప్రదాత, అతని ఆశయాలు ఆదర్శం అంటూ ఉపన్యాసాలిస్తూ, ఆయన వర్ధంతి రోజున కనీసం దాశరథి విగ్రహానికి దండేసేవారే కరువయ్యారని గ్రామస్తులు అసహనం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో కృష్ణమాచార్యుల జయంతి, వర్ధంతిని అధికారికంగా నిర్వహించినప్పటికీ ప్రస్తుత ప్రభుత్వం ఆయనను పట్టించుకోకపోవడంపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వెలిబుచ్చారు.
ఇవి కూడా చదవండి..
Telangana | ఆర్టీఏ చెక్‌పోస్టు బారికేడ్లపై రాష్ట్ర అధికారిక చిహ్నం మార్పు
Harish Rao | రెసిడెన్షియల్ స్కూళ్లకు కూడా రేవంత్ రెడ్డి రాజకీయ రంగు పులిమారు.. హరీశ్‌రావు ధ్వజం
KTR | కేవలం బ్లాక్ మెయిల్ దందా కోసమే ‘హైడ్రా’.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
KTR | తెలంగాణలో భూముల విలువ ఛూమంతర్ అనగానే పెరగలేదు : కేటీఆర్