IPL Mega Auction | ఉత్కంఠకు తెర.. జెడ్డాలో ఐపీఎల్ మెగా వేలం
IPL Mega Auction : ఐపీఎల్ 18వ సీజన్‌కు ముందు జరుగబోయే మెగా వేలంపై కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. ముందుగా అనుకున్నట్టుగానే నవంబర్ 24, 25వ తేదీల్లో వేలం జరుగనుంది. అయితే.. మీడియాలో వచ్చినట్టు రియాద్ వేదికగా ఆక్షన్ జరుగడం లేదు.
IPL Mega Auction : ఐపీఎల్ 18వ సీజన్‌కు ముందు జరుగబోయే మెగా వేలంపై కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. ముందుగా అనుకున్నట్టుగానే నవంబర్ 24, 25వ తేదీల్లో వేలం జరుగనుంది. అయితే.. మీడియాలో వచ్చినట్టు రియాద్ వేదికగా ఆక్షన్ జరుగడం లేదు. ఆఖరి నిమిషంలో అనూహ్యంగా జెడ్డా (Jeddah) నగరం పేరు తెరపైకి వచ్చింది. దాంతో, ఈసారి జెడ్డా వేదికగా వేలం ప్రక్రియ నిర్వహించేందుకు సిద్దమవుతోంది.
ఈసారి జరుగనున్న మెగా వేలం కోసం ఇప్పటికే 1,574 మంది క్రికెటర్లు పేర్లు నమోదు చేసుకున్నారని ఐపీఎల్ పాలక వర్గం ఎక్స్ వేదికగా వెల్లడించింది. వీళ్లలో 320 మంది క్యాప్డ్ ఆటగాళ్లు, 1,224 మంది అన్క్యాప్డ్ ప్లేయర్లు, అసోసియేట్ దేశాలకు చెందిన 30 మంది క్రికెటర్లు ఉన్నారు. అయితే.. వేలంలో 204 మంది ఆటగాళ్లను మాత్రమే అమ్ముడుపోయే వీలుందని ఐపీఎల్ యాజమాన్యం తమ పోస్ట్‌లో తెలిపింది.
✍️ 1574 Player Registrations
🧢 320 capped players, 1,224 uncapped players, & 30 players from Associate Nations
🎰 204 slots up for grabs
🗓️ 24th & 25th November 2024
📍 Jeddah, Saudi Arabia
Read all the details for the upcoming #TATAIPL Mega Auction 🔽🤩
— IndianPremierLeague (@IPL) November 5, 2024
ఆద్యంతం ఉత్కంఠగా సాగిన 17వ సీజన్ మినీ వేలంలో ఆసీస్ పేసర్ మిచెల్ స్టార్క్ (Mitchell Starc) రూ.24.75 కోట్ల రికార్డు ధర పలకగా.. కంగారూ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ (Pat Cummins) రెండో స్థానంలో నిలిచాడు. దాంతో, ఈసారి కండ్లు చెదిరే ధర పలికేది ఎవరు? అని అభిమానులు ఆసక్తిగా ఉన్నారు. అయితే.. ఈసారి రిషభ్ పంత్ రూ.25 నుంచి రూ.30 కోట్లు కొల్లగొడుతాని విశ్లేషకులు, క్రీడా పండితులు ఘంటాపథంగా చెబుతున్నారు.
రిటైన్ జాబితా ఇదే
సన్‌రైజర్స్ హైదరాబాద్ – హెన్రిచ్ క్లాసెన్, ప్యాట్ కమిన్స్, అభిషేక్ శర్మ, నితీశ్ కుమార్ రెడ్డి, ట్రావిస్ హెడ్
ముంబై ఇండియన్స్ – రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా
చెన్నై సూపర్ కింగ్స్ – రుతురాజ్ గైక్వాడ్, రవీంద్ర జడేజా, శివం దూబే, ఎంఎస్ ధోనీ.
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు – విరాట్ కోహ్లీ, రజత్ పాటిదార్, యశ్ దయాల్.
కోల్‌కతా నైట్ రైడర్స్ – రింకూ సింగ్, వరుణ్ చక్రవర్తి, ఆండ్రూ రస్సెల్, సునీల్ నరైన్, రమన్‌దీప్ సింగ్, హర్షిత్ రానా.
ఢిల్లీ క్యాపిటల్స్ – అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, ట్రిస్టన్ స్టబ్స్, అభిషేక్ పొరెల్
రాజస్థాన్ రాయల్స్ – సంజూ శాంసన్, యశస్వీ జైస్వాల్, అశ్విన్, రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్
గుజరాత్ టైటాన్స్ – రషీద్ ఖాన్, శుభ్‌మన్ గిల్, సాయి సుదర్శన్, రాహుల్ తెవాటియా, షారుక్ ఖాన్.
లక్నో సూపర్ జెయింట్స్ – నికోలస్ పూరన్, రవి బిష్ణోయ్, మయాంక్ యాదవ్, అయుశ్ బదొని, మొహ్సిన్ ఖాన్
పంజాబ్ కింగ్స్ – శశాంక్ సింగ్, ప్రభ్సిమ్రాన్ సింగ్.
ఇవి కూడా చదవండి
- Sharda Sinha | జానపద గాయని శారదా సిన్హాకు అస్వస్థత.. ఢిల్లీ ఎయిమ్స్‌కు తరలింపు
- Telangana | ఆర్టీఏ చెక్‌పోస్టు బారికేడ్లపై రాష్ట్ర అధికారిక చిహ్నం మార్పు
- Osmania University | ఎంబీఏ(టీఎం), ఎంబీఏ (ఈవినింగ్) ప్రవేశాల గడువు పొడగింపు
- Srisailam Sea Plane | విజయవాడ – శ్రీశైలం మధ్య సీప్లేన్.. భ్రమరాంబ మల్లికార్జున స్వామిని దర్శించుకోనున్న ఏపీ సీఎం చంద్రబాబు
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
నిరంతర విద్యుత్తు హామీ ఏమైంది?
వీరన్న సన్నిధిలో సాంస్కృతిక ధర్మ యుద్ధానికి శ్రీకారం : చుంచు రామకృష్ణ
Ayesha Khan | ఎర్ర చీరలో కట్టిపడేస్తున్న ఆయేషా ఖాన్.. అందమైన ఫొటోలు చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
Chandrababu | చంద్రబాబుకు చేసిన పనులు చెప్పి ఓట్లు అడిగే దమ్ముందా? : ఎంపీ అవినాష్ రెడ్డి
MP Manoj Tiwari: యమునా నదిలో ఈత కొట్టి.. నీళ్లు తాగిన ఢిల్లీ ఎంపీ.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

