Osmania University | ఉస్మానియా యూనివర్సిటీ : ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని ఎంబీఏ (టెక్నాలజీ మేనేజ్మెంట్), ఎంబీఏ (ఈవినింగ్) కోర్సుల్లో ప్రవేశాలకు గడువును పొడగించినట్లు ఓయూ డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఐ. పాండురంగారెడ్డి తెలిపారు. ఓయూ బిజినెస్ మేనేజ్మెంట్ విభాగం సెమిస్టర్ విధానంలో అందజేసే ఈ కోర్సుల్లో చేరేందుకు ప్రవేశ పరీక్షకు హాజరవ్వాల్సి ఉంటుందని, ఈ పరీక్షకు దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు చెప్పారు. తమ వెబ్సైట్ నుంచి దరఖాస్తు ఫారాలను డౌన్లోడ్ చేసుకుని, పూర్తిగా నింపి, రూ.500 అపరాధ రుసుముతో సహా నియమిత రుసుమును ఈ నెల 14వ తేదీవరకు దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు.
పరీక్షను ఈ నెల 17వ తేదీన నిర్వహిస్తామని తెలిపారు. పై రెండు కోర్సులూ ఈవినింగ్ కోర్సులేనని చెప్పారు. ఈ కోర్సుల వ్యవధి రెండేళ్లని పేర్కొన్నారు. టీఎస్ ఐసెట్-2024లో అర్హత సాధించినవారు ఈ పరీక్ష రాయాల్సిన అవసరం లేదని, వారు దరఖాస్తు సమర్పించి, నేరుగా కౌన్సిలింగ్‌కు హాజరుకావచ్చని వివరించారు. ఈ రెండు కోర్సులకూ డిగ్రీ పూర్తి చేసి రెండేళ్లు ఎగ్జిక్యూటివ్ కేడర్‌లో విధులు నిర్వర్తించిన అనుభవం ఉండడం తప్పనిసరి అని చెప్పారు. ఇతర వివరాలకు www.ouadmissions.com, www.osmania.ac.in వెబ్సైట్లలో చూసుకోవచ్చని సూచించారు.
ఇవి కూడా చదవండి..
Harish Rao | రెసిడెన్షియల్ స్కూళ్లకు కూడా రేవంత్ రెడ్డి రాజకీయ రంగు పులిమారు.. హరీశ్‌రావు ధ్వజం
KTR | కేవలం బ్లాక్ మెయిల్ దందా కోసమే ‘హైడ్రా’.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
KTR | తెలంగాణలో భూముల విలువ ఛూమంతర్ అనగానే పెరగలేదు : కేటీఆర్