Sharda Sinha : ప్రముఖ జానపద గాయని (Folk singer) శారదా సిన్హా (Sharda Sinha) అస్వస్థతకు గురయ్యారు. దాంతో కుటుంబసభ్యులు ఆమెను ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రికి (Aiims Hospital) తరలించారు. ప్రస్తుతం ఎయిమ్స్ వైద్యులు ఆమెకు చికిత్స అందిస్తున్నారు. శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతుండటంతో వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స చేస్తున్నారు.
నా సోదరి శారదా సిన్హా అస్వస్థతకు గురవడంతో ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించామని, ప్రస్తుతం ఆమెను వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నారని ఆమె సోదరుడు విజయ్ ఠాకూర్ చెప్పారు. బీహార్ కోసం ఆమె ఎంతో చేశారని, బీహార్ సంప్రదాయ పాటలకు ప్రాచుర్యం కల్పించారని అన్నారు. ఇప్పుడు ఆమె పరిస్థితి బాధకరంగా ఉందని, ఆమె త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నామని చెప్పారు.
గాయని శారదా సిన్హా బీహార్ జానపద కళలకు జీవం పోశారు. ఫోక్ సాంగ్స్‌తో బీహార్ సంస్కృతి, సంప్రదాయాలను కళ్లకు కట్టినట్లు వివరించారు. గత కొన్ని రోజులుగా ఆమె వృద్ధాప్య సంబంధ అనారోగ్యంతో బాధపడుతున్నారు.