ఢిల్లీ: మరికొద్దిరోజుల్లో అబుదాబి వేదికగా నిర్వహించాల్సి ఉన్న ఐపీఎల్ వేలానికి ముందు పలువురు విదేశీ ఆటగాళ్లు తాము సీజన్ మొత్తానికి అందుబాటులో ఉండలేమని కొత్త మెలిక పెట్టారు. గత సీజన్లో పంజాబ్ కింగ్స్‌కు ఆడిన జోష్ ఇంగ్లిస్.. 2026లో నాలుగు మ్యాచ్‌లు మాత్రమే ఆడతానని బీసీసీఐకి తెలిపాడు.
వేలంలో భారీ ధర పలుకుతాడని అంచనాలున్న ఇంగ్లిస్.. అన్ని తక్కువ మ్యాచ్‌లు ఆడితే అతడిమీద ఫ్రాంచైజీలు ఆసక్తిచూపుతాయా? అన్నది ఆసక్తికరం. ఇంగ్లిస్‌తో పాటు ఆసీస్‌కే చెందిన అగర్, సదర్లండ్, రిలీ రూసో సైతం తాము కొన్ని మ్యాచ్‌లే ఆడతామని బీసీసీఐకి తెలిపారు.