IPL 2025 | ఐపీఎల్ చివరి దశకు చేరింది. ఆదివారం క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ముంబయి ఇండియన్స్‌తో తలపడనున్నది. ఈ మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు జూన్ 3న అహ్మదాబాద్‌లో జరిగే ఫైనల్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో తలపడనున్నది. ఆర్సీబీ తొలిసారి టైటిల్ గెలిచేందుకు అవకాశాలున్నాయి. అన్ని సమీకరణాలు సైతం ఆర్సీబీకి అనుకూలంగానే ఉన్నాయి. అయితే, ఐపీఎల్ ఫైనల్‌కు ముంబయి చేరితో మాత్రం ఆర్సీబీకి కష్టతరంగా మారే అవకాశం ఉన్నది. అయితే, అంతకు ముందు ముంబయి జట్టు.. పంజాబ్‌ను అధిగమించాల్సి ఉంది. క్వాలిఫయర్-1 గెలిచిన జట్టుకే టైటిల్‌ను ఎక్కువసార్లు గెలిచింది. క్వాలిఫయర్-2లో గెలిచిన జట్టు మాత్రమే తక్కువ సార్లు ఈ ఘనత సాధించాయి.
ఐపీఎల్ ప్రారంభం అంటే 2008 నుంచి 2010 వరకు లీగ్ నాకౌట్ మ్యాచ్‌లు సెమీ ఫైనల్ ఫార్మాట్లో జరిగాయి. అయితే, 2011 నుంచి నియమాలు మారాయి. సెమీ ఫైనల్ ప్లేఆఫ్‌లు ప్రారంభమయ్యాయి. క్వాలిఫయర్-1, క్వాలిఫయర్-2, ఎలిమినేటర్ మ్యాచ్‌లు తీసుకువచ్చింది. అప్పటి నుంచి 2024 వరకు మొత్తం 14 సీజన్లు ఈ ఫార్మాట్లో జరిగాయి. ఇందులో క్వాలిఫయర్-1 గెలిచిన జట్టు 11 సార్లు ఫైనల్ గెలిచింది. క్వాలిఫయర్-2 గెలిచిన జట్టు టైటిల్‌ను ఎక్కువ సార్లు గెలువలేకపోయింది. ఆర్సీబీ జట్టు సైతం ఈ జాబితాలో ఉంది. ఇక ఐపీఎల్లో ఆర్సీబీ ఫైనల్‌కు చేరడం ఇది నాలుగోసారి. ఇంతకు ముందు 2009, 2011, 2016లో ఫైనల్‌కు చేరింది. 2016లో ఆర్సీబీ క్వాలిఫయర్-1 గెలిచి ఫైనల్‌కు చేరుకుంది. కానీ, సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆర్సీబీని ఫైనల్లో ఓడించింది. ఆ సమయంలో ఎస్ఆర్హెచ్ ఎలిమినేటర్ ఆడి ఫైనల్‌కు చేరింది. ఎలిమినేటర్ ఆడి ఫైనల్‌కు చేరుకొని టైటిల్‌ను గెలిచిన ఏకైక జట్టుగా ఎస్ఆర్హెచ్ ఈ ఘనత సాధించింది.
క్వాలిఫయర్-1 గెలిచిన జట్టు 14 సార్లు ఫైనల్ చేరగా.. 11 సార్లు టైటిల్‌ను గెలిచింది. దాంతో ఈ సారి ఆర్సీబీ టైటిల్ ఆశ నెరవేరుతుందని అభిమానులు ఆశిస్తున్నారు. అయితే, 2013, 2016, 2017లో మాత్రం క్వాలిఫయర్-1 గెలిచిన జట్టు మాత్రం ఫైనల్లో ఓటమి పాలయ్యాయి. మరోవైపు, క్వాలిఫయర్-2 గెలిచిన జట్టు మూడుసార్లు టైటిల్‌ను గెలిచాయి. 2013లో చెన్నై సూపర్ కింగ్స్ క్వాలిఫయర్-1లో ముంబయిని ఓడించి ఫైనల్‌కు చేరుకుంది. అయితే, ముంబయి క్వాలిఫయర్-2లో గెలిచి ఫైనల్‌కు చేరింది. అంతే కాకుండా సీఎస్కేను ఓడించి చాంపియన్‌గా అవతరించింది. ఇదే తరహాలో ముంబయి 2017లోనూ విజయం సాధించింది. రైజింగ్ పుణే సూపర్ జెయింట్స్ క్వాలిఫయర్-1లో ముంబయిని చిత్తు చేసింది. ముంబయి క్వాలిఫయర్-2ని గెలిచింది. ఫైనల్లో పుణేను ఒక పరుగు తేడాతో ఓడించి టైటిల్‌ను ఎగరేసుకొని పోయింది.
ఐపీఎల్ ఫైనల్లోకి చేరితో ముంబయి జట్టు ఆర్సీబీకి షాక్ ఇచ్చే అవకాశం ఉంది. ఆర్సీబీ చేతిలో క్వాలిఫయర్-1 మ్యాచ్‌లో ఓటమికి ప్రతీకారం తీర్చుకునే అవకాశం పంజాబ్‌కు సైతం ఉన్నది. 2013, 2017లో సీజన్లలో ముంబయి జట్టు చేసిన తరహాలోనే పంజాబ్ సైతం అద్భుతం చేసే అవకాశాలున్నాయి. 2018 నుంచి 2024 సీజన్ వరకు క్వాలిఫయర్-1 గెలిచిన జట్టు మాత్రమే చాంపియన్‌గా నిలిచింది. 2018, 2021, 2023 సీజన్లలో సీఎస్కే, 2019, 2020 సీజన్లలో గుజరాత్.. 2022 సీజన్లో గుజరాత్, 2024లో కోల్‌కతా నైట్‌రైడర్స్ క్వాలిఫయర్-1 మ్యాచ్‌లో గెలిచి ఫైనల్‌కు చేరాయి. అంతే కాకుండా ఫైనల్లోనూ గెలిచి టైటిల్‌ను సాధించాయి. ఈ క్రమంలో ఈ సారి కప్ ఆర్సీబీదేనని అభిమానులు సంబరపడుతున్నారు. అయితే, అభిమానుల ఆశలు నెరవేరుతాయా? లేదా? వేచిచూడాల్సిందే.
పంజాబ్ X ముంబై ..నేడు ఐపీఎల్ క్వాలిఫయర్-2 పోరు
కబడ్డీ సంఘంలో కోట్లు గోల్మాల్