IPL 2025 : వారం రోజులకుపైగా వాయిదా పడిన ఐపీఎల్ 18వ సీజన్ లీగ్ మ్యాచ్‌లు నేటితో పునః ప్రారంభం కానున్నాయి. హిటర్ల బ్యాటింగ్ మెరుపులు.. బౌలర్ల వికెట్ సంబురాలను చూడలేకపోయిన అభిమానులు ఇక పండుగ చేసుకోనున్నారు. ప్లే ఆఫ్స్ రేసు ఆసక్తికరంగా మారిన వేళ శనివారం బెంగళూరులో ఐపీఎల్ షో టైమ్‌కు కౌంట్‌డౌన్ మొదలైంది. చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB)ను కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) ఢీ కొడుతోంది. ఈ మ్యాచ్‌తో మళ్లీ ఐపీఎల్ సందడి మొదలవుతుండడంతో భారీగా ఫ్యాన్స్ మైదానానికి తరలి రానున్నారు.
షెడ్యూల్ ప్రకారమే రాత్రి 7 గంటలకు టాస్.. 7:30గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే.. వర్ష సూచన ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. దాంతో, ప్లే ఆఫ్స్ బెర్తును నిర్ణయించే కీలక జరుగుతుందా? లేదా? అని అందరిలో ఉత్కంఠ నెలకొంది. 18వ ఎడిషన్ ఆరంభంలో వరుసగా చిన్నస్వామిలో మూడుకు మూడు మ్యాచుల్లో ఓడింది ఆర్సీబీ. గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ చేతిలో పరాజయం పాలైంది. అయితే. ఏప్రిల్ 24న రాజస్థాన్ రాయల్స్‌కు షాకిచ్చిన రజత్ పాటిదార్ బృందం సొంత ఇలాకాలో తొలి విజయం నమోదు చేసింది.
A cracking contest on the cards as #TATAIPL returns to action tonight 🔥#RCB or #KKR, who do you reckon will bag 2⃣ points tonight? 🤔#RCBvKKR | @RCBTweets | @KKRiders pic.twitter.com/UMvU3JUNeT
— IndianPremierLeague (@IPL) May 17, 2025
ఆ తర్వాత స్వీయ ప్రేక్షకుల సమక్షంలో చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings)ను హడలెత్తించి.. టాప్ 4లోకి దూసుకెళ్లింది. ప్రస్తుతం ఆర్సీబీ 16 పాయింట్లతో పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతోంది. శనివారం కోల్‌కతాతో జరిగే మ్యాచ్ బెంగళూరు జట్టు ప్లే ఆఫ్స్‌కు బెర్తును నిర్ణయించనుంది. వరల్డ్ క్లాస్ బౌలర్లు అయిన వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్ (Sunil Narine)ల.. రూపంలో బెంగళూరు ఆటగాళ్లకు స్పిన్ పరీక్ష ఎదురవ్వనుంది. కోల్‌కతా సంధించే స్పిన్ ఛేదించగలిగితే 18 పాయింట్లతో.. మరో రెండు రెండు మ్యాచ్‌లు ఉండగానే నాకౌట్‌కు అర్హత సాధించనుంది. కాబట్టి.. ఈ మ్యాచ్ బెంగళూరు జట్టుకే కాదు అభిమానులకు ఎంతో కీలకమైనదని అంటున్నారు విశ్లేషకులు. ఇప్పటికే 12 మ్యాచ్‌లు ఆడేసిన కోల్‌కతా.. ఆర్సీబీ చేతిలో ఓడిపోతే ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించడం ఖాయం.
ఐపీఎల్ ఆరంభ సీజన్ నుంచి ఇప్పటివరకూ రెండుసార్లు వాయిదా పడింది. మొదటగా కరోనా (Corona) సమయంలో మెగా లీగ్‌ను సస్పెండ్ చేశారు నిర్వాహకులు. తాజాగా భారత్, పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో టోర్నీని నిలిపివేశారు. అయితే.. కాల్పుల విరమణతో ఇరుదేశాలు శాంతి మంత్రం జపించడంతో.. మళ్లీ ఐపీఎల్‌కు లైన్ క్లియర్ అయింది. మే 9 ఢిల్లీ, పంజాబ్ మ్యాచ్ రద్దు నుంచి బోసిపోయిన స్టేడియాలు మే 17 నుంచి అభిమానులతో కళకళలాడనున్నాయి. జూన్ 3న అహ్మదాబాద్‌లో జరిగే ఫైనల్‌తో విజేత ఎవరో తేలిపోనుంది.
A lot to play for as the road to playoffs intensifies 🤩
Who can make it to the Top 4⃣? 🤔
🔽 Read to find out 🔗 | #TATAIPL
https://t.co/8FTBbz7f0j pic.twitter.com/ThW6O9VSUC— IndianPremierLeague (@IPL) May 16, 2025